పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం అక్టోబర్ 8: తాడేపల్లిగూడెంమండలం లో ఇసుక అక్రమ రవాణా చేస్తూ అధిక ధరలకు విక్రయిస్తున్నారని తహసీల్దార్ సునీల్ కుమార్ కి ప్రజల నుండి ఫిర్యాదులు రావడంతో, మంగళవారం ఉదయం తెల్లవారుజామున నాలుగు గంటల నుండి పోలీస్ ఐలాండ్ వద రెవెన్యూ మరియు పోలీస్ డిపార్ట్మెంట్ల సహాకారం తో తనిఖీలు నిర్వహించారు. ప్రభుత్వం ప్రజలకు ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తుందని, గ్రామ సచివాలయాల ద్వారా ఇసుక ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే ఉచితంగా ఇసుకను పంపిణీ చేస్తారని తాసిల్దార్ సునీల్ కుమార్ తెలిపారు, ఇసుక అక్రమంగా రవాణా చేసే వారిపై ప్రభుత్వ ఆదేశాలు మేరకు కఠిన చర్యలు తీసుకుంటమని తహసీల్దార్ సునీల్ కుమార్ హెచ్చరించారు. ఇసుక ఆన్లైన్ బుకింగ్ సాంకేతిక సమస్యలపై జిల్లా టోల్ ఫ్రీ నెంబర్ 8688291997 సంప్రదించాలని తెలిపారు.
