పశ్చిమగోదావరి జిల్లా ఆచంట అక్టోబర్ 5:
ఆచంట మండలంలోని గోదావరి తీర ప్రాంతాల నుంచి ఇసుక తవ్వకాలకు ఎటువంటి అనుమతులు లేవని.. ఎవరైనా ఇసుకను అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆచంట తహసిల్దార్ ఎం సోమేశ్వరరావు శనివారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో హెచ్చరించారు. కోడేరు, కరుగోరు మిల్లి, అయోధ్య లంక గ్రామాల నుంచి ఇసుక అక్రమంగా తరలిపోకుండా ఆయా ర్యాంపుల వద్ద సంబంధిత విఆర్ఓ వీఆర్ఏలతో నిఘా ఏర్పాటు చేశామని వెల్లడించారు. ఇసుక అవసరమైన వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని వారి అవసరాలు పరిశీలించిన తర్వాత వారు అనుమతులు ఉన్న రాంపుల నుంచి ఇసుక తెచ్చుకోవడానికి అనుమతులు మంజూరు చేస్తామని తహాసిల్దార్ అన్నారు. అక్టోబర్ నెలాఖరు నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామని రైతులు తమకు నచ్చిన రైస్ మిల్లులకు ధాన్యం అమ్ముకోవచ్చునని వెల్లడించారు.
ఆచంట మండలంలో రేషన్ షాపుల బైఫరికేషన్ కార్యక్రమంలో భాగంగా కొత్తగా రెండు రేషన్ షాపులు రానున్నట్లు తెలిపారు. ఇదేవిధంగా ఇప్పటికే ఖాళీగా ఉన్న మరో ఆరు రేషన్ షాపులు కు కూడా త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి భర్తీ చేస్తామని