ఎమ్మెల్యే రఘురాం కృష్ణంరాజుపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో దళితువాడలో తిరగనివ్వం
మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ ఘాటువ్యాఖ్యలు
పశ్చిమగోదావరి జిల్లా పెనుమంట్ర మండలం వెలగల వారి పాలెం తాళ్లచెరువు నందు ఏర్పాటుచేసిన మాల మహానాడు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్* మాట్లాడుతూ ఉండి నియోజకవర్గం శాసనసభ్యులు రఘురాం కృష్ణరాజు అంబేద్కర్ ఫ్లెక్సీ చించి వేయటం చాలా దారుణం అని దీనిపై రఘురాం కృష్ణంరాజు ఇప్పుడు వరకు కేసు నమోదు చేయకపోవడం క్షమాపణ చెప్పపోవడం చాలా దారుణం అని ప్రతి నియోజకవర్గంలో కార్యచరణ చేస్తున్నామని ఇకనైనా రఘురాం కృష్ణంరాజు పై చర్యలు తీసుకోకపోతే దళితులంతా ఏకమై రఘురామకృష్ణ రాజుకు తగిన బుద్ధి చెప్తామని పుష్ప రాజ్ హెచ్చరించారు *కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిల్లే రాజ్ కుమార్, కార్యదర్శి కోలాటి ప్రసాదరావు, రొక్కాల సతీష్, కాటుక అనిల్, పల్లి ఆనంద్, భావన మోషే, ఆచంట నియోజవర్గ కార్యదర్శి సాఖ బాబు రాజేంద్రప్రసాద్, తరపట్ల జోషి ,తదితరులు పాల్గొన్నారు*