ఏలూరు జిల్లా/ ఉంగుటూరు
అక్టోబర్ 1 : ఏలూరు జిల్లా ఉంగుటూరు మండలం వెల్లమెల్లి గ్రామానికి చెందిన సిద్ధాంతి దండమూడి వెంకటేశ్వరరావు 2024 జరగబోయే ఎలక్షన్లలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అధికారంలోకి వస్తారని 160 సీట్లు పైచిలుకు గెలుచుకుంటారని ఆరు నెలల ముందే తెలియచేసిన వెల్లమిల్లి సిద్ధాంతి.అలాగే కొంతమంది నాయకులు గెలుస్తారని ముక్కు సూటిగా చెప్పడంతో దండమూడి వెంకటేశ్వరరావు ను ప్రముఖులు రాజకీయ నాయకులను నిత్యం తమ భవిష్యత్తు రాజకీయం ఎలా ఉంటాదో అని సంప్రదింపులు జరుపుతూనే ఉండేవారు. అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కు సిద్ధాంతి వెంకటేశ్వరరావు ఆశీర్వచనాలు అందించారు.అనంతరం చంద్రబాబు నాయుడు నిద్దాంతి వెంకటేశ్వరరావును సన్మానించారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం కి చెందిన ప్రముఖ ఆర్యవైశ్యులు వ్యాపారవేత్తలు చలంచర్ల మురళి చలంచర్ల హరి పాల్గొన్నారు.