పశ్చిమగోదావరి జిల్లా అక్టోబర్ 1 – పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర పరిధిలోని మారుటేరులో గల వివేకానంద స్కూల్ నందు దసరా వేడుకలు ఘనంగా నిర్వహించారు. అధర్మం మీద ధర్మం చేసిన యుద్దానికే ప్రతీక దసరా. శ్రీరాముడు రావణాసురుడిపై చేసిన ధర్మ యుద్దమే ఈ దసరా కాబట్టి అందరూ వాళ్ళ జీవితాన్ని ధర్మ మార్గంలోనే గడపాలని తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్ధినీ విద్యార్ధులు బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. రకరకాలైన పిండివంటలు చేసి దుర్గమాతకు పూజలు నిర్వహించారు. బాలికలు నవదుర్గలుగా వేషధారణ చేసి అందరినీ అలరించారు. విద్యార్ధుల నృత్యాలతో కేరింతలతో దసరా పండుగ వాతావరణం సందడిగా నిలిచింది. ఈ కార్యక్రమంలో పిల్లల తల్లిదండ్రులు ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
