March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆచంటపశ్చిమగోదావరి జిల్లా

పారిశుధ్య కార్మికులను శాలువాలతో సత్కరించిన సర్పంచ్ కాసాని విజయలక్ష్మి 

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

 

స్వచ్ఛ భారత్ కు పునాది పారిశుధ్య కార్మికులు

పశ్చిమగోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం  స్వచ్ఛ తా హి సేవ-2024 కార్యక్రమాలలో భాగంగా పెనుగొండ మండలం వడలి గ్రామపంచాయతీ వద్ద గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి కాసాని విజయలక్ష్మి ఆధ్వర్యంలో పంచాయతీ పారిశుధ్య కార్మికులను శాలువాలు , పండ్లు ఇచ్చి సన్మానించడం జరిగినది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి చంటి మాట్లాడుతూ….
పారిశుద్ధ్య నిర్వహణలో ఏ గ్రామం అయితే ముందంజలో ఉంటుందో ఆ గ్రామం ఎప్పుడూ అభివృద్ధి పదంలో కొనసాగుతుందని ..పారిశుధ్య కార్మికులు ఆరోగ్యంగా ఉంటే ప్రజల ఆరోగ్యంగా ఉంటారని, వారిని మనం గౌరవించాలని తెలియచేస్తూ వారికి స్వీట్స్ ను ఇచ్చి అభినందించడం జరిగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి శ్రీ P.A. రామకృష్ణ మాట్లాడుతూ స్వచ్ఛభారత్ కు మూలకారణం పారిశుద్ధ్య కార్మికులని తెలియజేసి, స్వచ్ఛభారత్ ప్రాధాన్యతను వివరించడం జరిగినది.ఈ కార్యక్రమంలో పంచాయతీ పాలకవర్గ సభ్యులు శ్రీ మేకా శివయ్య , నాయకులు శ్రీ గణపతినీడి బుల్లియ , పంచాయతీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది,ఆరోగ్య సిబ్బంది పాల్గొనడం జరిగింది.

Related posts

ఉద్యోగ నిర్వహణలో ఉన్నత అధికారుల గుర్తింపు, సామాజిక సేవలో ఆణి ముత్యం నంది అవార్డు గ్రహీత కె జయమణి

AR TELUGU NEWS

సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షులుగా వసంతాడ హరేష్

AR TELUGU NEWS

పెనుగొండ లోజనసేన నాలుగో విడత సభ్యత కార్యక్రమం

AR TELUGU NEWS