పశ్చిమగోదావరి జిల్లా అక్టోబర్ 1 – ఆచంట నియోజకవర్గం వల్లూరు గ్రామం లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో గోవింద నామాలు పటించిన జనసేన నాయుకులు మరియు తెలుగుదేశం నాయుకులు, బీజేపీ నాయకులు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ ఉమ్మడి పగో జిల్లా సెక్రటరీ చిట్టూరి శ్రీనివాస్ మాట్లాడుతూ తిరుపతి దేవస్థానం లో లడ్డు తయారీ లో కల్తీ నెయ్యి వాడడం అపచారామని, దానికి ప్రాయశ్చితం గా జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన ప్రాయశ్చిత దీక్ష కుమద్దత్తుగా జనసేన పార్టీ నాలుగు రోజు కార్యక్రమాలకు పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా ఈ రోజు రెండవ రోజు వల్లూరు గ్రామం లో గ్రామ ప్రజలు, కూటమి సభ్యులు కలిసి గోవింద నామాలు పాటించడం జరిగిందని, ఈ రోజు రాత్రి వరకు కూడా వల్లూరు గ్రామ లో మైక్ సెట్స్ ఏర్పాటు చేసి తిరుపతి ఏడుకొండలు పై నిత్యం పటించే గోవింద నామాలు ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమం లో ఆచంట వైస్ ఎంపీపీ తాళం శ్రీనివాసరావు, జనసేన పార్టీ గ్రామ అధ్యక్షులు కడిమి ఉమామహేశ్వరస్వామి, జనసేన పార్టీ ఆచంట మండలం ఉపాధ్యక్షులు తోట ఆదినారాయణ, బీజేపీ జిల్లా నాయకులు హరి శివరామకృష్ణ, జనసేన పార్టీ వల్లూరు గ్రామ ఉపాధ్యక్షులు ఏడిద తేజా విగ్నేష్, తెలుగుదేశం పార్టీ ఆచంట మండలం ప్రధాన కార్యదర్శి ఏడిద శ్రీనివాసరావు, మాజీ నీటి సంఘం అధ్యక్షులు బండి వెంకటేశ్వరావు, జనసేన పార్టీ ఆచంట మండలం సెక్రటరీ కాపవరపు రామకృష్ణ, పంపన శ్రీను,వల్లూరు జనసేన పార్టీ గ్రామ ఉపాధ్యక్షులు సరిపల్లి వెంకటేశ్వరావు,జనసేన పార్టీ వల్లూరు గ్రామ ప్రధాన కార్యదర్శి ఇర్రింకి నాగరాజు, తోట సాయిబాబా, ఇందిరమ్మ కాలనీ అధ్యక్షులు ఖండవల్లి నరసిహామూర్తి మొదలగువారు పాల్గొన్నారు.