*స్మశాన వాటిక లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి*
*కాలనీలలో మౌలిక సదుపాయాలు కల్పించాలి*
*మాలమహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్*
పశ్చిమగోదావరి జిల్లా ఆచంట అక్టోబర్ 1- ఆచంట మండలానికి నూతనంగా విచ్చేసిన తాసిల్దార్ సోమేశ్వరరావు నీ మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్ప రాజ్ సాలువపూలమాలవేసి సత్కరించారు* ఈ సందర్భంగా పుష్పరాజ్ మాట్లాడుతూ ఆచంట మండలంలో స్మశానవాటికలు పై ప్రత్యేక శ్రద్ధ వహించి లేని చోట స్మశాన వాటికలు ఏర్పాటు చేసి ఉన్న స్మశానవాటికులను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అలాగే ఇళ్ల స్థలాలు లేని పేదవారిని గుర్తించి వారికి స్థలాలు ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వంలో కాలనీలలో ఇళ్ల స్థలాలు ఇచ్చిన చోట ఇంకా రోడ్లు, మంచినీరు ,డ్రైనేజీ సదుపాయాలు కల్పించేలా చర్యలు తీసుకోవాలని పుష్పరాజ్ కోరారు *కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి చిల్లే రాజ్ కుమార్, కోలాటీ ప్రసాదరావు, ఆచంట మండలం ప్రధాన కార్యదర్శి సాఖ బాబు రాజేంద్రప్రసాద్, తరపట్ల జోషి, తదితరులు పాల్గొన్నారు