పెనుగొండ మండలం వడలి గ్రామపంచాయతీ పరిధిలో *స్వచ్ఛతాహి సేవ-2024 కార్యక్రమాలలో* భాగంగా గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీమతి కాసాని విజయలక్ష్మి గారి ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్యాలయం నుండి ప్లాస్టిక్ నిషేధం, తడి చెత్త – పొడి చెత్త సేకరణ, వేరు చేయుట, పరిసరాల పరిశుభ్రత పై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. అనంతరం జాంపేట రామాలయం వద్ద, పిట్టల వేమవరం రోడ్డు రామాలయం వద్ద మానవహారం నిర్వహించి , పంచాయతీ కార్యదర్శి శ్రీ P.A. రామకృష్ణ స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పంచాయితీ కార్యవర్గ సభ్యులు శ్రీ మేక శివయ్య , శ్రీమతి చలుమూరి పార్వతి , గ్రామ టిడిపి అధ్యక్షులు శ్రీ ఉప్పలపాటి చంటి , గ్రామ మాజీ సర్పంచ్ శ్రీ అంగర వరప్రసాద్ , కూటమి నాయకులు, పంచాయితీ సిబ్బంది సచివాలయం సిబ్బంది ఆరోగ్య సిబ్బంది, డ్వాక్రా సిబ్బంది, డ్వాక్రా మహిళలు, ఉన్నత పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.
