ఆంగ్లో ఇండియన్ స్కూల్ విద్యార్థులు వరద సాయం 2,50,000 రూపాయలు
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం సెప్టెంబర్ 21- తాడేపల్లిగూడెం స్థానిక సుబ్బారావు పేట లో గల ఆంగ్లో ఇండియన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు విజయవాడ మరియు గుంటూరు వరద బాధితుల సహాయార్థం 2లక్షల 50 వేల రూపాయల విరాళం తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ గారికి అందించడం జరిగింది. ఈ సందర్భంగా శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులలో ఇటువంటి సేవా గుణం అభినందనీయమని, చిన్నతనం నుండి ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా వారిలో పిల్లలలో సేవా భావం మరియు సామాజిక బాధ్యత పెరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. ఆంగ్లో ఇండియన్ స్కూల్ చైర్మన్ కొడాలి రమేష్ బాబు డిడి ను శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి అందించారు.