కాకినాడ జిల్లా జగ్గంపేట సెప్టెంబర్ 19: ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక ప్రజా సమస్యలను పరిష్కరించే ఇది మంచి ప్రభుత్వం ప్రజా వేదిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. జగ్గంపేట నియోజకవర్గంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ వారం రోజులు పాటు సెప్టెంబర్ 20వ తేదీ నుండి 26వ తేదీ వరకు షెడ్యూల్ విడుదల 20వ తేదీ ఉదయం 10 గంటలకు కిర్లంపూడి మండలం జగపతినగరం, సెప్టెంబర్ 21వ తేదీ ఉదయం 10 గంటలకు గండేపల్లి మండలం మురారి, సెప్టెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు జగ్గంపేట మండలం మల్లిశాల, సెప్టెంబర్ 23వ తేదీ మధ్యాహ్నం2 గంటలకు సెప్టెంబర్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు కిర్లంపూడి మండలం బూరుగుపూడి 25వ తేదీ ఉదయం 10 గంటలకు గండేపల్లి మండలం సూరంపాలెం 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు జగ్గంపేట టౌన్ 26వ తేదీ ఉదయం 10 గంటలకు గోకవరం మండలం రంప యర్రంపాలెం గ్రామంలో ప్రజా వేదిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమాలకు అన్ని శాఖల ప్రభుత్వ అధికారులు హాజరై ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా చర్యలు తీసుకుంటారని కాబట్టి ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకుని మీ సమస్యలు వినతిపత్రం రూపంలో అందించాలని కోరారు. ఈ ప్రభుత్వం 100 రోజుల్లోనే మంచి ప్రభుత్వంగా నిరూపించుకుందని ప్రజల మెచ్చిన కొన్ని అంశాలు మీ ముందు ఉంచుతున్నామని నిరుద్యోగ యువతకు అండగా నిలబడుతూ మెగా డీఎస్సీ 16432 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడం, ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి వృద్ధులకు 4000 పింఛన్ ప్రతినెల ఒకటో తారీఖున అందించడం, ప్రతి నెల ఒకటో తారీఖునే ఉద్యోగుల జీతాలు, అన్నదాతలకు ధాన్యం కొనుగోలు బాకీలు, స్థానిక సంస్థలకు నిధులు కేటాయించడం, పేదల కోసం ఐదు రూపాయలకే అన్నం పెట్టే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయడం, అన్నదాతలకు నిద్ర లేకుండా చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం, విజయవాడలో వరదలకు 10 రోజులపాటు నిద్రలేని రాత్రులతో ప్రజలకు సేవ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు అని ఇది మంచి ప్రభుత్వం అనిపించుకోవడానికి ఇదే నిదర్శనం అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు.
