కోల్‌కతా డాక్టర్‌పై అత్యాచారం, హత్య పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.. అయితే.. నెల రోజులు దాటినా కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో పరిస్థితులు కుదటపడటం లేదు. నిరసనకు దిగిన జూనియర్ డాక్టర్లు సుప్రీంకోర్టు చెప్పినా విధుల్లోకి చేరడం లేదు.
కోల్‌కతా డాక్టర్‌పై అత్యాచారం, హత్య పై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేస్తోంది.. అయితే.. నెల రోజులు దాటినా కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రిలో పరిస్థితులు కుదటపడటం లేదు. నిరసనకు దిగిన జూనియర్ డాక్టర్లు సుప్రీంకోర్టు చెప్పినా విధుల్లోకి చేరడం లేదు. చర్చలకు రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానిస్తే దానికి వారి కొన్ని షరతులు విధించారు. నిన్న సాయంత్రం చర్చలకు బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జూనియర్ డాక్టర్లను ఆహ్వానించారు. ఈమెయిల్ ద్వారా వారికి చర్చలకు ఆహ్వానం పంపారు. అయితే ఈ చర్చల్లో సీఎం మమతా బెనర్జీ సమక్షంలో జరగాలని, ఆ చర్చలను లైవ్ టెలికాస్ట్ చేయాలని జూనియర్ డాక్టర్లు ప్రభుత్వాన్ని కోరారు. అంతే కాదు బెంగాల్‌లోని వివిధ మెడికల్ కాలేజీలు, ఆస్పత్రులకు చెందిన కనీసం 30 మంది ప్రతినిధులను ఈ చర్చల్లో పాల్గొనేందుకు అనుమతి ఇవ్వాలని జూనియర్ డాక్టర్లు కోరారు.
జూనియర్ డాక్టర్ల షరతులను బెంగాల్ సర్కారు తిరస్కరించింది. స్వేచ్ఛగా చర్చలు నిర్వహించేందుకు తాము సిద్ధమని, కాని ముందస్తు షరతులు పెడితే సుహృద్భావ వాతావరణం ఉండదని బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో కొంత మంది TMC నేతలు జూనియర్ డాక్టర్ల తీరును తప్పుబట్టారు. సుప్రీంకోర్టు ఆదేశాలను పాటించని జూనియర్ డాక్టర్లు దేశ వ్యతిరేకులను విమర్శించారు. న్యాయం కావాలన్న డిమాండ్ సహేతుకమైనదే అంటునే ముందు సీబీఐ విచారణ పూర్తి కావాలని TMC నేతలంటున్నారు.
మరో వైపు ఆగస్టు తొమ్మిదిన చనిపోయిన డాక్టరుకు న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ బీజేపీ కోల్‌కతాలో నిరసనలు కొనసాగిస్తూనే ఉంది. వైద్య విద్యార్థికి న్యాయం జరిగేంత వరకు తమ నిరసనలు ఆపబోమని బీజేపీ నేతలు స్పష్టం చేశారు.
ఈ ప్రతిష్ఠంభనను తొలగించేందుకు బెంగాల్ సర్కారు ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. నిరసనకు దిగిన డాక్టర్లపై కఠిన చర్య తీసుకునే ఆలోచనేది లేదని బెంగాల్ సర్కారు సంకేతాలు పంపింది. అదే సమయంలో జూనియర్ డాక్టర్ల తిరస్కార ధోరణిని సుప్రీంకోర్టుకు నివేదించనుంది. దానిపై సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందానే దాన్ని బట్టు ముందడుగు వేయాలనే ఆలోచనలో బెంగాల్ సర్కారు ఉంది.
ఆర్‌జీ కర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ తండ్రి ఇంట్లో ఈడీ సోదాలు
కోల్‌కతా ఆర్‌జీ కర్ ఆస్పత్రి మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ఆర్థిక అవకతవకలకు సంబంధించి ఈడీ దర్యాప్తు కొనసాగుతోంది. ఇందులో భాగంగా కోల్‌కతాలోని సందీప్ ఘోష్‌కు చెందిన రెండు నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇందులో ఒక ఇంట్లో ఆయన తండ్రి సత్యప్రకాశ్ ఘోష్ ఉంటున్నారు. ఆ ఇంటి పరిస్థితి చూస్తుంటే అందులో ఎవరూ ఉంటున్నట్టు కనిపించడం లేదు. ఆర్‌జీ కర్ ఆస్పత్రికి వైద్యపరికరాలు సరఫరా చేసే కాంట్రాక్టర్ నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.