మాధవరం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన
తాడేపల్లిగూడెం సెప్టెంబర్ 1పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం ఇష్టకామ్యాలను తీర్చే స్వామి వినాయకుడు అని వరసిద్ధి వినాయక స్వామి ఆలయ కమిటీ ప్రతినిధి తారమట్ల శ్రీను అన్నారు. వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బుధవారం తాడేపల్లిగూడెం మండలం మాధవరం వరసిద్ధి వినాయక స్వామి ఆలయం వద్ద భారీ అన్న సమారాధన నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఆలయ కమిటీ చైర్మన్ లక్కాకుల రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కోరిన కోరికలు తీరితే తలనీలాలు సమర్పిస్తామని మొక్కుకుంటే ఆ కోరికలు తీరతాయన్నారు. స్వామివారికి మొక్కుకొని ఎంతో మంది దేశ రక్షణ లో నిమగ్నమయ్యారన్నారు. స్వామి వారిపై ఉన్న భక్తితో వినాయక దీక్షను చేపట్టినట్లు తెలిపారు. గతంతో పోల్చుకుంటే ఈ ఏడాది దీక్ష చేపట్టిన వారు అధికమని పేర్కొన్నారు. దీక్ష పూర్తి చేసిన తర్వాత ఇక్కడ వినాయకుడిని నిమజ్జనం చేయనున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం ఆలయం వద్ద సిద్ది బుద్ధి సమేత వినాయకుని కళ్యాణం నిర్వహించనున్నట్లు తెలిపారు. కళ్యాణంలో పాల్గొనే దంపతులు ముందుగా పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. అనంతరం జరిగిన అన్న సమారాధనలో 5వేల మంది భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆలయ ధర్మకర్తల చైర్మన్ లక్కాకుల రంజిత్ సింగ్, ఆలయ కమిటీ అధ్యక్షుడు, లక్కాకుల శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ దండుపోయిన నరసింహారావు, ఆలయ కమిటీ ఇన్చార్జ్ పత్తి శివ, ఉత్సవ కమిటీ ఆర్గనైజర్స్ మంచాల రాజేష్, తమ్మిశెట్టి వెంకట్, ప్రతినిధులు తారమట్ల శ్రీను భక్తులు తదితరులు పాల్గొన్నారు.