గ్రంథాలయాలు విజ్ఞానానికి ఆలయాలు
*ఏపీ నిట్ రిజిస్ట్రార్ దినేష్ శంకర్ రెడ్డి
తాడేపల్లిగూడెం. సెప్టెంబర్ 10 -గ్రంధాలయాలు విజ్ఞానానికి అలయాలు అని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. సంస్థలోని గ్రంధాలయాన్ని ఎక్కువుగా వినియోగించుకుంటున్న విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో బిబ్లియోఫిల్ అవార్డును ప్రకటించారు. దీనిలో భాగంగా 2023-24 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన డాక్టర్ దినేష్ శంకర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి విద్యార్థిని విజ్ఞానవంతులుగా తీర్చిదిద్దడానికి గ్రంధాలయాలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. విద్యార్థుల సౌలభ్యం కోసం గ్రంధాలయంలో ఎన్నో వేల పుస్తకాలను అందుబాటులో ఉంచామని తెలిపారు. మనకి తెలియని ఎన్నో కొత్త కొత్త విషయాలను పుస్తకాల్లో శోధించి తెలుసుకునేందుకు చక్కటి విజ్ఞాన భాండాగారం గ్రంధాలయమన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రతి అరు నెలలకోసారి ఈ బిబ్లియోఫిల్ అవార్డును విద్యార్థులకు అందజేస్తామని వివరించారు. అనంతరం సివిల్ ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న సంతోనా నాయక్, బి.జయేష్ గిరీష్ లకు బిబ్లియోపిల్ అవార్డులను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ కార్తీక్ శేషాద్రి, గ్రంథాలయ చైర్ పర్సన్ డాక్టర్ చేబ్రోలు శ్రీలత, అసిస్టెంట్ లైబ్రేరియన్ కమల మహంతి
తదితరులు పాల్గొన్నారు.
