March 14, 2025
Artelugunews.in | Telugu News App
ఆంధ్రప్రదేశ్

దొరవారి తిమ్మాపూర్ గ్రామంలో పోలీసు వారు చేయూత వరద బాధితులకు అండగా గూడూరు సిఐ బాబురావు వెల్లడి!!

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

మహబుబాబాద్ జిల్ల ఎస్పి సుధీర్ IPS గారి ఆదేశాల మెరక గత పది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దొరవారి తిమ్మాపురం గ్రామానికి చుట్టుపక్కల ఉన్న వాగులు ఉదృతంగా ప్రవహిస్తుండడంతో బాహ్య ప్రపంచంతో రాకపోకలు స్తంభించిపోగా నిత్యవసరాలు లభించకపోవడంతో ఆకలితో అలమటిస్తున్న గ్రామస్తుల పరిస్థితి తెలుసుకున్న గూడూరు సిఐ బాబురావు గారు వెంటనే తన సర్కిల్ పరిధిలోని గూడూరు, కొత్తగూడ & గంగారం ఎస్.ఐ లు గిరిధర్ రెడ్డి, కుష కుమార్, రవికుమార్ మరి సిబ్బందిలతో కలిసి రెండు ట్రక్టర్ ల సహా యముతో అడవిలో 8 కిలోమీటర్లు ట్రాక్టర్లలోవెళ్తుండగా మూడు సార్లు బురదలో ట్రాక్టర్ దిగబడిన వెనుదిరగకుండా వెరే ట్రక్టర్ సహాయథాతో బయటకు తీసుకుని ఎంతకష్టమైన గ్రామాన్ని చేరుకొని గ్రామస్థులకు సహాయం చేయాలని గ్రామంని చేరుకుని 23 కుటుంబాలకు 15 రోజులకు సరిపడా నిత్యవసర సరుకులతో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న మూడు వాగులను దాటి గ్రామానికి చేరుకొని సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రజలకు ఆపద్బాంధవుల్ల సిఐ బాబురావు గారి ఆధ్వర్యంలో సర్కిల్ సిబ్బంది భరోసానివ్వడం జరిగింది.

పోలీసులకు కృతజ్ఞతలు తెలిపిన ఆ గ్రామస్తులు.

నిత్యావసరాలు లభించడంతో గ్రామస్తులు పోలీసువారికి ధన్యవాదాలు తెలుపుతూ తమ బాధను వెలిబుచ్చారు. చిన్నపిల్లలు పాలు లేక అల్లాడిపోతున్నారు అని, కొందరు ఇళ్లలో బియ్యం తడిసిపోయాయని, వండుకోవడానికి కూరగాయలు & నిత్యవసరాలు ఏమీ లేకపోవడంతో చాలా వేదనను అనుభవించామని ఇలాంటి కష్ట సమయంలో దేవుడిలా ఆదుకున్న పోలీసు వారు చేసిన సహాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేము అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వారి దయనీయ పరిస్థితిని చూసిన సీఐ బాబురావు మీ గ్రామానికి ఎటువంటి ఆపద ఉన్న వెంటనే పోలీసువారికి తెలియపరచాలని తప్పకుండా ఎల్లవేళలా మీకు సహాయ సహకారాలు అందించడానికి పోలీస్ వారు మీకు అందుబాటులో ఉంటారని భరోసా ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా గూడూరు సిఐ బాబురావు గారు మాట్లాడుతూ గూడూరు ,కొత్తగూడ ,గంగారం మండలాల్లో ప్రజలు ప్రస్తుత వర్షాబావ పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బందులు ఎదురైన వెంటనే పోలీసు వారికి సమాచారం ఇచ్చినట్లయితే తక్షణ సాయం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని మూడు మండలాల ప్రజలకు భరోసానివ్వడం జరిగింది.

Related posts

రైతులకు గోనె సంచులు ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని ఆర్డీవోకు వినతి

AR TELUGU NEWS

Ap news: అనంతపురం జిల్లాలో నూతన ఎస్పీ రౌడీ షీటర్లకు హెచ్చరికలు

AR TELUGU NEWS

సార్ కాస్తా మా బాధను అర్ధం చేసుకోండి’ – ఏపీలో ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ జాప్యంతో విద్యార్థుల ఆందోళన

AR TELUGU NEWS