బొలిశెట్టి పుట్టినరోజు సందర్భంగా పలు సేవా కార్యక్రమాలు”
తాడేపల్లిగూడెం ఆగస్టు 16:బాహుబలి, సేవా తత్పరుడు, ప్రజా సేవకుడు, పేదలపాటి పెన్నిధి ఆపద్బాంధవుడు తాడేపల్లిగూడెం శాసనసభ్యులు శ్రీ బొలిశెట్టి శ్రీనివాస్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య ముద్దుబిడ్డ పట్టణ ఆర్యవైశ్య గౌరవ అధ్యక్షులు ఎం వి ఆర్ కన్స్ట్రక్షన్స్ అధినేత శ్రీ మారం వెంకటేశ్వరరావు మారం గిరీష్ ఆధ్వర్యంలో పట్టణంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ముందుగా ఏరియా హాస్పిటల్ లో ఉన్న రోగులకు పండ్లు అందించారు. వృద్ధులకు 500 మందికి వస్త్రాలు పంపిణీ చేశారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మారం గిరీష్ మాట్లాడుతూ శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ కు రానున్న రోజుల్లో ఆయనకు మంత్రి పదవి వరించాలని భవిష్యత్తులో ప్రజలకు ఇంకా సేవ చేయడానికి మంచి ఆరోగ్యం ఆయనకు కలుగజేయాలని తాడేపల్లిగూడెం రాష్ట్రంలోనే నెంబర్ వన్ నియోజకవర్గం గా తీర్చిదిద్దాలని ఆయన కోరారు. శాసనసభ్యులుగా 10 సంవత్సరముల వరకు ఆయనే ఉండాలని ఆయన ఆకాంక్షించారు ఎక్కడ ఆపదంటే అక్కడకు వచ్చే మంచి మనసున్న మహారాజు బొలిశెట్టి అని కొనియాడారు కరోనా సమయంలో ఎంతోమందిని ఆదుకున్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ ఆర్ఎమ్ఓ తాతారావు, ఎం వి ఆర్ యూత్ నాయకులు మండా ప్రకాష్, ప్రసాద్, ఏసుబాబు, బుద్ధన సతీష్, మణికంఠ, పెనగంటి సాయి, గుత్తుల సురేష్, శివ మరియు ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.