తాడేపల్లిగూడెం ఆగస్టు 8:రజక ఫెడరేషన్ చైర్మన్ పదవి కాకినాడ రామారావుకు ఇవ్వాలని అఖిల భారత ధోబి మహా సంఘం రాష్ట్ర కార్యదర్శి జొన్నాడ శ్రీనివాస్ , రజక చైతన్య సేవా సంస్థ జిల్లా కన్వీనర్
ఊనగట్ల నాగ పోసి కృష్ణ అన్నారు. రాష్ట్ర పర్యటన లో భాగంగా లో కాకినాడ రామారావు గురువారం తాడేపల్లిగూడెం వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జొన్నాడ శ్రీనివాస్ మాట్లాడుతూ కాకినాడ రామారావు గత 45 సంవత్సరాలుగా టీడీపీ పార్టీలో ఉంటూ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డారన్నారు. పార్టీ ఆయనను గుర్తించి టిడిపి రాష్ట్ర కార్యదర్శిగాను, రామచంద్రపురం నియోజకవర్గం పరిశీలకులు నియమించడం జరిగిందన్నారు. అదేవిధంగా పార్టీకే కాకుండా వారి కుటుంబం రాష్ట్రంలో రజకులకు సేవలు అందించారన్నారు. కావున రాష్ట్ర ఫెడరేషన్ చైర్మన్ పదవి కాకినాడ రామారావు ను నామినేట్ చేయాలని
రాష్ట్ర రజక సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో కొట్టిచుక్కల రాము, వెల్దుటి శ్రీనివాస్, పొలామూరి అన్నవరం, అంజూరి శ్రీనివాస్, పిప్పర ప్రసాద్,రేజర్ల భద్రాచలం పాల్గొన్నారు.

previous post