గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే ఏర్పాట్లు చేయాలి
*జడ్పీ సీఈఓ తో తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి*
గత ఐదు సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు సరైన తాగునీరు అందించడంలో కూడా వైసీపీ ప్రభుత్వం విఫలమైందని కూటమి ప్రభుత్వంలో ఆ సమస్య తలెత్తకుండా గ్రామాల్లో పూర్తిస్థాయిలో స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేయాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ కోరారు. తాడేపల్లిగూడెంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద బుధవారం బొలిశెట్టిని మర్యాదపూర్వకంగా కలిసిన జడ్పీ సీఈవో కె ఎస్ సుబ్బారావుతో ఎమ్మెల్యే సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా గ్రామాల వారీగా మంచినీటి అవసరాలను గుర్తించి ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. నిధుల కోసం అవసరమైతే తాను స్వయంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరి సమీకరిస్తామన్నారు. మంచినీరు అందించడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆయన ఈ సందర్భంగా సూచించారు. ముందుగా జడ్పీ సీఈవో సుబ్బారావు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసులు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ డీఈలు, ఏఈలు, తాడేపల్లిగూడెం ఎంపీడీవో ఎస్ ఎస్ శర్మ తదితరులు పాల్గొన్నారు.

next post