చర్మ కారుల అందరికీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇవ్వాలి సంఘ జిల్లా అధ్యక్షులు యందం గాంధీ”
పెంటపాడు: చర్మకారుల వృత్తిదారు అందరికీ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్లు ఇప్పించాలని చర్మకారుల సంఘ జిల్లా అధ్యక్షులు గాంధీ మండల అభివృద్ధి అధికారి బాలాజీ వెంకటరమణకు వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా యందం గాంధీ మాట్లాడుతూ చర్మకారులు వృత్తిపై మండలంలో వందల మంది జీవనోపాధికి చెందుతున్నారని అర్హత గల ప్రతి ఒక్కరికి ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లోన్స్ ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. మండలంలో వందలాది మంది ఈ వృత్తిని నమ్ముకుని జీవిస్తున్నారని వారి కుటుంబ పోషణకి అవసరమయ్యే సామగ్రి అందించి అర్హత గల వారికి పెన్షన్ మంజూరు చేయాలని ఆయన అన్నారు. ఈ వృత్తి చేసుకునే వారికి ప్రభుత్వం గుర్తింపు కార్డులు మంజూరు చేసి, వృత్తి చేసుకునేందుకు తగిన పనిముట్లు పంపిణీ చేయాలని చర్మకార వృత్తి స్థలము చూపించి తగిన షెడ్లు నిర్మించి ఇవ్వాలని తమకు ప్రత్యేక సబ్సిడీ లోన్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. వినతి పత్రం ఇచ్చిన వారిలో యందం రామకృష్ణ కిల్లాడి సందీప్ తదితరులు పాల్గొన్నారు.