దళితులపై దాడులు చేస్తే ప్రతి దాడులు తప్పవు – అంబేద్కర్ ఆలోచన వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చవ్వాకుల భరత్ హెచ్చరిక
సివిల్ రైట్స్ డే నిర్వహణలో విఫలమైన జిల్లా అధికారయంత్రాంగ
పాలకోడేరు జులై 31 :
పాలకోడేరు మండలం గొల్లలకోడేరు గ్రామపంచాయతీ ఆవరణలో సివిల్ రైట్స్ డేకార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పొన్నమండ. బాలకృష్ణ, చవ్వాకుల. వి. ఆర్. భరత్ కుమార్ పాల్గొని మాట్లాడారు. అధికారుల సమాచారం లోపం కారణంగా కేవలం సచివాలయం, గ్రామ పంచాయతీ సిబ్బందితో సమావేశం జరిపించారు. గ్రామాలలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కారం, చట్టాలు, హక్కులు, దళితులకు వర్తించే రాయతీలు వంటి అంశాలపై చర్చించే అవకాశం లేదు. గ్రామానికి చెందిన దళితులు ఎవరు సమావేశంలోపాల్గొలేదు. ఎస్సీ/యస్. టి అత్యాచారం కేసులు గురించి, దళితులపై జరుగుతున్నదాడులు, వివక్షత, మహిళపై జరుగుతున్న ఆగత్యాలు, మానభంగాలు, మహిళలు అక్రమ రవాణా, పోక్స్ కేసులు, మాదకద్రవ్యల అక్రమ రవాణా, వినియోగం, ఇవ్టీజింగ్, దళితులకు చెందిన స్మశానం భూముల ఆక్రమణలు, స్మశానవాటికలను మెరక చేయకపోవడం, భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్, బాబాసాహెబ్, బి. ఆర్. అంబేద్కర్ విగ్రహాలు ధ్వంసం చేయటం, చెప్పుల దండలు వేయడం వంటి హేయమైన చర్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సివిల్ రైట్స్ డే నిర్వహించడంలో అలసత్వం వహించిన అధికారులపై జిల్లా ఉన్నతాదికారులకు పిర్యాదు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో గ్రామ సర్పంచ్ కుక్కల. లక్ష్మి, మండలరెవెన్యూ ఇన్స్పెక్టర్ ముత్యాల. నాగభూషణం, ఈఓపిర్ అండ్ ఆర్. డి. ఎం. రామాంజనేయులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ యస్. రాము, సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు, గ్రేడ్ 5, సెక్రటరీ కె. శ్రీ విద్య, వి. ఆర్. ఓ, కె. ఇందిర, సచివాలయం, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.