ఇంటివద్దనే ఎన్.టి.ఆర్ భరోసా పించన్ల పంపిణీ సర్వం సిద్ధం…
జిల్లాలో 2,31,874 మంది పెన్షన్ దారులు వున్నారని, వీరికి 97.26 కోట్లు పంపిణి…
జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి
భీమవరం జూలై 31 :
జిల్లాలో ఆగష్టు 1న ఎన్.టి.ఆర్ భరోసా పించన్ల పంపిణీ లబ్దిదారులకు ఇంటివద్దనే చెల్లించడానికి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లను చేసిందన్నారు. ఆగస్ట్ 1వ తేదీ ఉదయం 6.00 గం.ల నుంచి పింఛన్లు పంపిణీ కావాలన్నారు. మొదటి రోజే నూరు పంపిణీ పూర్తి చేయాలన్నారు. ఈ విషయాన్ని ప్రతి గ్రామం, వార్డులో ముందస్తు ప్రచారం చేపట్టాలని అన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లే అవకాశం ఉన్నందున, పింఛన్ల పంపిణీపై వారికి ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. జిల్లాలో 2,31,874 మంది పెన్షన్ దారులు వున్నారని, వీరికి 97.26 కోట్లు పంపిణి చేయవలసియున్నదన్నారు. పెన్షన్ పంపిణి కొరకు 4,243 మంది సిబ్బందిని మ్యాప్ చేయడం జరిగిందన్నారు. ఎంపీడీవోలు, కమీషనర్లు సచివాలయలం, ఉద్యోగి వారిగా పరిశీలించి, పంపిణీని ప్రతి గంట గంటకు పర్యవేక్షించాలన్నారు. బయట ప్రాంతాల్లో ఉంటున్న పించన్ దార్లు సాయంత్రంలోగా వారి గ్రామాలకు విచ్చేసి పించన్ అందుకువాలని విజ్ఞప్తి చేశారు. పించన్ పంపిణీ తీరును డి.ఆర్.డి.ఎ లో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నుండి పర్యవేక్షించడం జరుగుతుందన్నారు. అందుబాటులో లేని లబ్ధిదారులకు రెండవ తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు.