నరసాపురం నుండి మచిలీపట్నం కు రైల్వే లైన్ కావాలని విజ్ఞప్తి – డాక్టర్. చినమిల్లి
రైల్వే లైన్ నిర్మాణానికి ప్రాథమిక సర్వే చేయాలని ఆదేశాలిచ్చిన రైల్వే మంత్రిత్వ శాఖ
నర్సాపురం జూలై 26 :
శ్రీ వై. ఎన్. కళాశాల సెక్రెటరీ అండ్ కరస్పాండెంట్ మరియు జనసేన సీనియర్ నాయకులు డాక్టర్ .చినమిల్లి సత్యనారాయణ రావు కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల సహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ ని జూలై నెల ఒకటో తారికున మర్యాద పూర్వకంగా కలసి నరసాపురం నుండి మచిలీపట్నం కు రైల్వే లైన్ నిర్మాణాన్ని చేపట్టాలని విజ్ఞప్తి చేసారు. రైల్వే నిబంధనల మేరకు ప్రాథమిక సర్వే నిర్వహించి సెంట్రల్ రైల్వేస్ నుంచి అనుమతులు వచ్చేవిధంగా కృషిచేస్తానని భూపతిరాజు శ్రీనివాస వర్మ హామీ ఇచ్చారు. అప్పుడు ఇచ్చిన హామీలో బాగంగా నరసాపురం నుండి మచిలీపట్నం కు రైల్వే లైన్ నిర్మాణాన్నికి ప్రాథమిక సర్వే చేయవలిసినదిగా కేంద్ర రైల్వే మంత్రి అంగీకరించారు. ఈ సందర్భాంగా సానుకూల నిర్ణయం తీసుకొన్నందుకు గాను దేశ ప్రధాన మంత్రి నరేoద్రమోడి కి, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కి, కేంద్ర ఉక్కు మరియు భారీ పరిశ్రమల సహాయ మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస వర్మ కి, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ కి, నర్సాపురం ఏం.ఎల్.ఎ.బొమ్మిడి నాయకర్ కు నర్సాపురం పుర ప్రజల తరుపున డాక్టర్. చినమిల్లి సత్యనారాయణ రావు కృతజ్ఞతలుతెలియ చేస్తూ ఒక పత్రిక ప్రకటన విడుదల చేశారు.