మండల న్యాయ సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో
మానవ అక్రమ రవాణా వ్యతిరేక పై అవగహన
నర్సాపురం / లిఖితపూడి రూరల్ 30 :నేడు ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నర్సాపురం మండల న్యాయ సేవాదికార సంస్థ ఆధ్వర్యంలో నర్సాపురం రూరల్ లిఖితపూడి గ్రామ సచివాలయం నందు న్యాయవాదుల సంఘం అధ్యక్షులు శ్రీ చల్లా దానయ్య నాయుడు గారి అధ్యక్షతన న్యాయ అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దానయ్య నాయుడు మాట్లాడుతూ ఇటీవల కాలంలో వేలాది మంది స్త్రీలు, పిల్లలతో బాటు , విదేశాలలో చదువులకు వెళ్లిన పురుషులను కూడా అక్రమ రవాణాకు గురవుతున్నారు. అక్రమ రవాణా అనేది తీవ్రమైన నేరం మరియు మానవ హక్కులకు తీవ్రమైన ఉల్లంఘన. ఆడపిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉన్నందున తల్లిదండ్రులైన వారు తమ పిల్లలపై ప్రత్యేక శ్రద్ద వహించాలి. ప్రతి రోజు వార్తల ద్వారా ప్రపంచంలో ఏదో ఒక మూల ట్రాఫికింగ్ కి గురై హత్యలు జరిగినట్లు వింటూనే ఉన్నాం. చిన్న పిల్లల్ని, మహిళలను కిడ్నాప్ చేసి ఇతర దేశాలకు అమ్మి సొమ్ము చేసుకునే ముఠాలు కూడా మన సమీపంలోనే ఉన్నారు. గ్రామస్థులు అప్రమత్తంగా ఉండి, క్రొత్త వారు కనిపిస్తే వారిని గమనిస్తూ ఉండాలి. మోసపూరితమైన మాటలకు, ఉపాధి కల్పిస్తామని , అరబ్ దేశాలలో కూడా జీవనోపాధి కల్పిస్తామని చెప్పి చల్లా మందిని నెలల తరబడి గదిలో బంధించి హించించే వారు కూడా ఉన్నారు. పేదరికం కూడా సమాజంలో మానవ అక్రమ రవాణాకు ముఖ్య కారణమన్నారు. దీన్ని నిరోధించడానికి గ్రామ స్థాయి నుండి గ్రామస్థులు మధ్య ఐక్యత కలిగివుండాలి. గ్రామంలో క్రొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతుంటే దగ్గరలో ఉన్న పోలీస్ వారికి ఫిర్యాదు చేయాలన్నారు. పిల్లలు మాదక ద్రవ్యాలకు అలవాటు పడకుండా ముఖ్యంగా మగ పిల్లల్ని తల్లిదండ్రులు గమనిస్తూ ఉండాలన్నారు. ప్రేమతో తమ పిల్లలకి ద్విచక్రవాహనం బాటు హెల్మెట్ కూడా ఇవ్వండి. మరణాపయం నుండి తప్పించుకోడానికి హెల్మెట్ ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో
న్యాయవాది మరియు లీగల్ సర్వీసెస్ సభ్యులు వై. దేవేంద్ర ఫణికర్, వై. సతీష్, లీగల్ ఎయిడ్ కౌన్సిల్స్ కె. చిట్టి పద్మజ, ఎన్. ఆనంద్ బాబు, రూరల్ ఎ .ఎస్. ఐ శ్రీనివాస్ , గ్రామ సర్పంచ్ పి. చిట్టిబాబు, సచివాలయం మహిళ పోలీస్ కె. దుర్గ, సిబ్బంది, అంగన్వాడీ సిబ్బంది, డ్వాక్రా మహిళలు గ్రామస్థులు పాల్గొన్నారు.