- అర్హులైన ప్రతీ కుటుంబానికి సొంతిల్లు ఎన్డీఏ ప్రభుత్వంతోనే సాధ్యం
జిల్లా టీడీపీ అధ్యక్షురాలు అనంతకుమారి..
కొత్తపేట.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సరికి ప్రభుత్వం ఖజానాలో పైసా కూడా లేదని అంబేద్కర్ కోనసీమ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు రెడ్డి అనంతకుమారి వివరించారు.మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఏ శాఖలో చూసినా అప్పులే కనపడుతున్నాయి తప్ప ఆదాయ వనరులు ఏమి లేవనీ ఆమె అన్నారు.ముఖ్యమంత్రి గా చంద్రబాబు బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే కీలకమైన ఐదు హామీలు అమలుకై ఐదు ఫైల్లపై సంతకం చేశారనీ గుర్తు చేశారు.వేలాదిమంది నిరుద్యోగులు, రైతులు, 65 లక్షల మంది పింఛనుదారులు, యువత, పేదలకు లబ్ధి చేకూరుతుందనీ ఆమె చెప్పారు.ఇలా ఇచ్చిన హామీలను ఒక్కక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్న ఎన్డీఏ సర్కార్ ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకుందనీ తెలిపారు.హౌసింగ్ ఫర్ ఆల్ అనే నినాదంతో చంద్రన్న ప్రభుత్వం ముందుకు సాగుతుందనీ 2014లో ప్రతీ పేదవాడికి ఇళ్లు కట్టించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు పీఎంఏవై వాటా కింద రూ.1.80 లక్షలతో పాటు రాష్ట్ర వాటాగా గ్రామీణ ప్రాంతాల వారికి రూ.50 వేలు, పట్టణ ప్రాంతాల వారికి రూ. 1 లక్ష సాయం అందించారనీ తద్వారా 12 లక్షల మందికి లబ్ధి చేకూరిందనీ చెప్పారు.2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం పేదల కలలపై నీళ్లు పోసిందనీ పేదలందరికీ ఇళ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి పట్టాలు మాత్రమే ఇస్తాం ఇళ్లు మీరే కట్టుకోవాలని మాట తప్పిందనీ ఆమె వాపోయారు.కేంద్ర సాయం రూ.1.80 లక్షలు తప్ప పేదల ఇంటి నిర్మాణానికి గత ప్రభుత్వం ఇచ్చింది సూన్యం అని చెప్పారు.ఒక్క పట్టణ ప్రాంత లబ్ధిదారులకు ఉపాధి హామీ పథకం కింద రూ.30 వేలు అందించి చేతులు దులుపేసుకున్నారనీ,కేంద్ర గృహ నిర్మాణాల కోసం ఇచ్చిన రూ.5 వేల కోట్లను కూడా దారి మళ్లించారనీ అన్నారు.ఇళ్ళ స్థలాలకు పట్టణాల్లో 1.5 సెంటు గ్రామాలలో 2 సెంట్లు టీడీపీ ఇవ్వగా దాన్ని జగన్ రెడ్డి సెంటుకే కుదించాడని అన్నారు.తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడడంతో పేదల ఆశలు మరలా చిగురించాయనీ పేదవాడి ఆశల మేరకే చంద్రబాబు ప్రభుత్వం ఇళ్ల స్థలాలు లేని వారికి గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు అందజేయనున్నట్లు తెలిపారు.సొంత స్థలం ఉండి ఇళ్లు నిర్మించుకోలేని వారికి కూడా రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయనుందనీ పేద మధ్య తరగతి వారి కోసం రూ.4 లక్షలు ఇంటి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 40 శాతం (రూ.1.50 లక్షలు) కాగా కేంద్ర ప్రభుత్వం వాటా 60 శాతం (రూ.2.50 లక్షలు) గా ఉందని,ఇళ్ల నిర్మాణంలో పేదలు ఇబ్బందులు పడకూడదనే సదుద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకన్నారనీ చెప్పారు.వాటితో పాటు జర్నలిస్టులకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఇళ్లు కట్టించి ఇవ్వనుందనీ తెలిపారు.