తాడేపల్లి గూడెం జులై19:
పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం శుక్రవారం
డెంగ్యూ నివారణే ఉత్తమ రక్షణ
పరిసరాల పరిశుభ్రత దోమల నివారణకు మార్గం
సమిష్టి భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని అరికడదాం
ఫ్రై డే డ్రై డే వ్యాధులకు అడ్డుకట్ట డెంగ్యూ వ్యతిరేక మాసొత్సవాలలో భాగముగా తాడేపల్లిగూడెం మండలం వి. అర్.గూడెం ప్రాధమిక ఆరోగ్య కేంద్రము పరిదిలోని పెడతాడేపల్లి సచివాలయం పరిదిలో తాడేపల్లిగూడెం సబ్ యూనిట్ అధికారి వై.వి.లక్ష్మణ రావు ఆధ్వర్యంలో మాశోత్సవాలు మరియు క్షేత్ర స్థాయిలో ఫ్రై డ్రై కార్యక్రమాల పరిశీలన చేయుట జరిగినది .సబ్ యూనిట్ అధికారి మాట్లాడుతూ డెంగ్యూ నివారణ మాసో త్సవాలు 01.07.24 నుండి ప్రారంభించబడి 31.07.24 వరకు ప్రతి సచివాలయం పరిధిలో డెంగ్యూ వ్యాధి రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు లార్వా బ్రీడింగ్ ప్రదేశాలను కనుగొనుట తద్వారా శానిటేషన్ మరియు పంచాయితీ వారి సహకారంతో కీటక నియంత్రణ చర్యలు చేపట్టుట ,డెంగ్యూ జ్వరలక్షణాల్ను బట్టి చికిత్స అందించూ,ప్రాథమిక నిర్ధారణ పరీక్షలు అన్ని పట్టణ ఆరోగ్యకరం,ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు,అన్ని విలేజ్ హెల్త్ క్లినిక్స్ లో అందుబాటు లో ఉంటాయని అందరూ సద్వినియోగ పర్చుకోవాలని సమిస్తికృషితో డెంగ్యూ వ్యాధిని అరికడ దాం అని పిలుపు నిచ్చారు.ఈ కార్యక్రమములో ఎం.ఎల్ . హెచ్.పి. లు నవ్య,ప్రవల్లిక,ఆరోగ్యకర్యకర్తకు పద్మ, కుమారీ ఆరోగ్య సహాయకులు రమేష్, ఆశాలు అంగన్వాడీ కార్యకర్తలు మొదలగువారు పాల్గొన్నారు