ఎమ్మెల్యేలు పితాని, నాయకర్ ఘనంగా పోడూరులో జనసేన పార్టీ కార్యాలయం, పతాక ఆవిష్కరణ
పోడూరు, జూలై 18 :
పార్టీలకు అతీతంగా ప్రజలకు సేవచేద్దామని ఆచంట, నరసాపురం ఎమ్మెల్యేలు పితాని సత్యనారాయణ, బొమ్మిడి నాయకర్లు అన్నారు. జనసేన గ్రామ, మండల అధ్యక్షులు బొక్కా గణపతి, రావి హరీష్ బాబు, గ్రామ నాయకులు, కార్యకర్తల సంయుక్త ఆధ్వర్యంలో పోడూరులో జనసేన పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం, పార్టీ పతాక ఆవిష్కరణ కార్యక్రమాలను నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత పితాని మాట్లాడుతూ కూటమి అధికారం ఏ ఒక్కపార్టీ కృషి కాదని, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల సమిష్టి కృషి అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వం, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. ప్రజాసమస్యల పరిష్కార వేదిక పార్టీ కార్యాలయం అని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. పథకాలపై ముఖ్యమంత్రి ముఖచిత్రాలు, ప్రభుత్వ కార్యాలయాలకు పార్టీ రంగులు వేసి ప్రజాధనాన్ని వృథా చేశారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పింఛను పెంపు, ఉచిత ఇసుక, యువతకు ఉద్యోగ అవకాశాలకు మేగా డీఎస్సీ, త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పడానికి సంతోషిస్తున్నామన్నారు. అనంతరం ముఖ్య అతిధిగా హాజరైన నాయకర్ మాట్లాడుతూ పార్టీ కార్యాలయం ఏర్పాటు సంతోషదాయమన్నారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆశయాలు, ఆలోచనలు, పార్టీ బలోపేతాని కార్యాలయం వేదిక కావాలన్నారు. ప్రజల్లోకి పార్టీ ప్రతిష్ట పెంచేలా ప్రజాసమస్యలు పరిష్కరించేలా క్రమశిక్షణతో ఉండాలన్నారు. స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ అనుభవం ఉన్న ప్రజానాయకుడన్నారు. ఆయనకు సహకారిగా, ప్రజలకు అందుబాటులో ఉంటారన్నారుజనసైనికులు ఏదైతే తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీ కూడా మనదే బిజెపి పార్టీ కూడా మనదే మన మూడు పార్టీలు ఒకటే అన్న నినాదంతో మన ప్రతి ఒక్కరు కూడా నియోజకవర్గ ప్రతి ఒక్కరు కూడా కలిసి మనందరం కూడా ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్న మనం ఈ మూడు పార్టీలు కోటమే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాబోయే ఈ ఐదు సంవత్సరాలు కాదు వచ్చే ఐదు సంవత్సరాలలో కూడా పరిపాలన ప్రజలకు ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగా ఏ రకంగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రజలు తరిమి తరిమి కొట్టారో మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మనం కూడా అదే మన అధికారంలోకి వచ్చాము ప్రజలకి అభివృద్ధి పథంలో వారందరికీ అండగా ఉండే విధంగానే మన పరిపాలన ఉండాలని చెప్పి మనందరం కూడా ముందుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేశారు.
మండల జనసేన అధ్యక్షులు రావి హరీష్, ఉపాధ్యక్షులు తోలేటి వేణు, గ్రామ జనసేన అధ్యక్షులు బొక్క గణపతి, ఉపాధ్యక్షులు పట్నాల నాగేశ్వరావు, గ్రామ టిడిపి అధ్యక్షులు దొమ్మేటి పురుషోత్తం, టిడిపి నాయకులు రుద్రరాజు వరహాలు రాజు రమేష్ రాజు రుద్రరాజు రవిరాజు రుద్రరాజు బంగారురాజు దొంగ వర ప్రసాదు, నాలుగు మండలాలజనసేన నాయకులు పెనుమంట్ర మండల జనసేన నాయకులు కోయ కార్తీక్, నియోజవర్గ జనసేన కన్వీనర్ షేక్ అలీ, ఆచంట మండలం నాయకులు అంజి బాబు , పెనుగొండ మండల నాయకులుకంబాల బాబులు,
జనసేన తదిత బిజెపి కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.