నిరుపేద చిన్నారులకు విద్యా పరికరాలు అందించిన వాసవి క్లబ్ అధ్యక్షులు నున్న ఆనంద్
తాడేపల్లిగూడెం
తాడేపల్లిగూడెం 32 వ వార్డు కడకట్ల ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులు రవికిరణ్ ఆధ్వర్యంలో వాసవి క్లబ్ వారు చిన్నారులకు విద్యా పరికరాలను పుస్తకాలను పంపిణీ చేశారు. రవికిరణ్ విజ్ఞప్తి మేరకు సుమారు 30 మంది పేద విద్యార్థిని విద్యార్థులకు పుస్తకాలు పెన్సిల్స్ స్కేల్స్ ఎరేజర్స్ జామెంట్రీ బాక్సులు వీటితోపాటు స్వీట్స్ హాట్స్ వాసవి క్లబ్ అధ్యక్షులు నున్న ఆనంద్, కార్యదర్శి గుప్తా వనిత క్లబ్ వారితో కలిసి చిన్నారులకు అందజేశారు. వాసవి క్లబ్ అధ్యక్షులు నున్న ఆనంద్ మాట్లాడుతూ సేవకు ప్రతిరూపమే వాసవి క్లబ్ ఎవరికి ఏ సమయంలో కష్టం వచ్చినా ఆదుకోవడానికి ఎల్లవేళలా వాసవి క్లబ్ తోడు ఉంటుందని కష్టపడి చదువుకునే వారికి తప్పనిసరిగా తాము మరింత ప్రోత్సాహకరమైన బహుమతులు అందజేస్తామని తెలియజేశారు.