వైజ్ ఇంజినీరింగ్ కళాశాలకు అటానమస్ హోదా
– తాడేపల్లిగూడెం :
ప్రకాశరావుపాలెంలోని వైజ్ ఇంజినీరింగ్ కాలేజ్కు స్వయం ప్రతిపత్తి (అటానమస్) లభించిందని కళాశాల పాలకవర్గ అధ్యక్ష కార్యదర్శులు నంధ్యాల కృష్ణమూర్తి, ఆకుల త్రిమూర్తి లు తెలిపారు. గురువారం వైజ్ ఇంజినీరింగ్ కళాశాలలో అటానమస్ హోదా లభించన సందర్భంగా పాలకవర్గం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో అధ్యక్ష కార్యదర్శులు నంధ్యాల కృష్ణమూర్తి, ఆకుల త్రిమూర్తి లు మాట్లాడుతూ జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజీ యూనివర్శిటీ ఆధ్వర్యంలో నడుస్తున్న వెస్ట్ గోదావరి ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (వైజ్) కళాశాలకు అటానమస్ గుర్తింపు లభించిందన్నారు. జె.ఎన్.టి.యు. యూనివర్శిటీ అధికారులు గుర్తింపు లభించినట్లు తెలిపారు. నాణ్యమైన, సాంకేతిక విద్య, నూతన కోర్సులను అందించేందుకు స్వయం ప్రతిపత్తి హోదా ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. విద్యార్ధుల అవసరాలకు అనుగుణంగా విద్యా ప్రమాణాలు, పాఠ్యాంశాలను ఏర్పరచుకోవడానికి స్వేచ్ఛ లభిస్తుందన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా నలుమూలల నుంచి కళాశాలకు బస్సు సౌకర్యం ఉందన్నారు. సి.సి. కెమేరాల పర్యవేక్షణ, అత్యుత్తమమైన టెక్నాలజీతో కూడిన కంప్యూటర్ ల్యాబ్లు, అనుభవజ్ఞులైన అధ్యాపకులతో విద్య అందిస్తున్నామన్నారు. ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. అరవింద్ కుమార్ మాట్లాడుతూ తమ కళాశాలకు అటానమస్ హోదా పొందడం ద్వారా యు.జి.సి. నిబంధనలకు అనుగుణంగా కొత్త కోర్సులు, ప్రోగ్రామ్లను రూపొందించుకోవడానికి అవకాశం లభిస్తుందన్నారు. విద్యార్ధులకు నైపుణ్యాభివృద్ధి పెంపొందించేందుకు, నూతన అవిష్కరణలను రూపొందించడానికి అటానమస్ హోదా ఉపయోగపడుతుందన్నారు. విద్యార్ధులకు కావలసిన సాంకేతిక విద్యా సామాగ్రి అందుబాటులో ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ఛైర్మన్ ఈతకోట భీమశంకరరావు, కోశాధికారి శానం మిహిర్ మోహన్, జాయింట్ సెక్రటరీ నామన రాంబాబు, డైరెక్ట జంగా బాలాజీ, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు