మానవ హక్కులు,అవినీతి వ్యతిరేక సంస్థ ప గో జిల్లా మహిళా అధ్యక్షురాలు గా మనుబర్తి లలిత
తణుకు జూలై 09 :
పశ్చిమ గోదావరి జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలుగా తణుకు పట్టణానికి చెందిన మనుబర్తి లలిత ను నియమించినట్లు ఆ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు గుండరెడ్డి మల్లికార్జున రెడ్డి తెలిపారు. తణుకు లో జరిగిన ప్రత్యేక సమావేశంలో మనుబర్తి లలిత సేవలను దృష్ట్యా ఆమెను జిల్లా మహిళ ప్రెసిడెంట్ గా నియమించినట్లు సంస్థ వ్యవస్థాపకుడు జి. మల్లికార్జున రెడ్డి స్పష్టం చేసారు. ఈ సందర్భంగా మనుబర్తి లలిత మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లాలో మహిళలకు ఎక్కడ సమస్యలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా అండగా ఉంటానని పాల్గొన్న మహిళలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మానవ హక్కుల మరియు అవినీతి వ్యతిరేక సంస్థ సభ్యులు మరియు తదితరులు పాల్గొన్నారు.