మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసిన
హైకోర్టుఅడ్వకేట్, ముద్రగడ పద్మనాభ రెడ్డి
పెనుగొండ జులై 06 :
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని తాడేపల్లి లోని తన క్యాంపు కార్యాలయంలో ముద్రగడ పద్మనాభం,కాసు మహేష్ రెడ్డి,ముఖ్య నాయకులుతో కలసిన హైకోర్టు అడ్వకేట్,రాజకీయ విశ్లేషకులు ఇండుగపల్లి రామానుజ రావు.ఈ సందర్భంగా వైయస్ జగన్ ను శాలువాతో సత్కరించి,ఆధ్యాత్మిక గ్రంథాలను బహుకరించారు.ఓటమినైన అంగీకరిస్తా కానీ అమలు చేయలేని హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేయలేమని నొక్కి వక్కాణించారు వైఎస్ జగన్,2014వ సంవత్సరంలో కూడా అమలు చేయలేని హామీలను ఇవ్వకపోవడం వల్లే ఓడిపోయిందని,2019వ సంవత్సరంలో నవరత్నాలతో ప్రజల ముందుకు వచ్చి నవరత్నాలతో పాటు పెద్ద ఎత్తున ప్రజా సంక్షేమ పథకాలను వాలంటీర్, సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఇంటి లబ్ధిదారులకు కుల,మత,వర్గ,పార్టీ బేధం లేకుండా అందించామన్నారు.తద్వారా ప్రజలకు చేరువయ్యామన్నారు. 2024 సంవత్సరంలో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఓడిపోవడానికి కారణాలు అందరికి తెలిసినవే అన్నారు.జగన్ అనే ఒకడిని ఎదుర్కొనలేక కూటమిగా అన్ని పార్టీలు ఏకమై,అమలు చేయలేని హామీలతో,ఈవీఎంల ముసుగులో ప్రజలను మభ్యపెట్టి భయబ్రాంతులకు గురిచేసి అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ ఆటలు ఏ టేల్ల కాలం సాగదని అన్నారు. గెలిచిన ఓడిన భయపడకుండా ప్రజల వైపే వైఎస్ఆర్సిపి ఉంటుందని,ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకుంటూ అధికార పార్టీ టిడిపి ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చేల పోరాటం చేస్తామన్నారు. వైయస్ఆర్సీపీ శ్రేణులపై దాడులు చేసిన, ఆస్తులు ధ్వంసం చేసిన, తప్పుడు కేసులు పెట్టిన భయపడేది లేదని కేడర్కు భరోసాగా ఉంటామని వైయస్ జగన్ తెలిపారన్నారు.