March 9, 2025
Artelugunews.in | Telugu News App
అమరావతిఆంధ్రప్రదేశ్

మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ…..రూ.60వేల కోట్లతో ఏర్పాటు

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

అమరావతి: మచిలీపట్నంలో రూ.60 వేల కోట్లతో భారత్‌ పెట్రోలియం రిఫైనరీ ఏర్పాటుకానుంది. దిల్లీ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు గురువారం కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్‌ పురితో భేటీ అయ్యారు.

ఈ సందర్భంగా మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటుచేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. ఇది నాలుగేళ్లలో పూర్తవుతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుంది. రిఫైనరీ ఏర్పాటుకు సుమారు 2-3 వేల ఎకరాల భూమి అవసరమని కేంద్ర మంత్రి సూచించగా..

మచిలీపట్నంలో అందుబాటులో ఉందని, ఇంకా కావాలన్నా ఇస్తామని మచిలీపట్నం జనసేన ఎంపీ వల్లభనేని బాలశౌరి వివరించారు. దీనిపై కేంద్రమంత్రి పురి, చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మచిలీపట్నం అయితే అన్ని విధాలా అనుకూలంగా ఉంటుందని.. రాజధానికి దగ్గరగా ఉండటంతో పాటు పోర్టు కూడా అందుబాటులో ఉంటుందని చెప్పారు. మచిలీపట్నంలో బీపీసీఎల్‌ రిఫైనరీ ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని.. భారీ ఎత్తున ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంటుందని బాలశౌరి వివరించారు.

Related posts

కార్యకర్తల ఆత్మీయ సమావేశం లో ఎమ్మెల్యే చెరుకువాడ శ్రీరంగనాధారాజు

AR TELUGU NEWS

తనకు ఓటు వేసిన ఓటరు మహాశయులకు కృతజ్ఞతలు

AR TELUGU NEWS

విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలి.. హైకోర్టు న్యాయవాది దద్దాల జగదీష్.. పెనుమూరు

AR TELUGU NEWS