కాకినాడ జిల్లా జగ్గంపేట జులై 5: స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి జ్ఞాపిక అందించి శుభాకాంక్షలు తెలియజేసిన గండేపల్లి మండల ఫోటోగ్రఫీ యునియన్ ఈ సందర్భంగా యూనియన్ సభ్యులు మాట్లాడుతూ ఫోటోగ్రఫీ యూనియన్ ఎప్పుడు ప్రజలకు అందుబాటులో టెక్నాలజీ విషయం లో దుసుకుపోతామని ప్రభుత్వం ప్రతి ఫోటోగ్రఫీ మిత్రుడికి బ్యాంకు లోన్ లో సహాయసాకారం అందించాలని మరియు ప్రభుత్వ రంగాలలో అవకాశాలు కల్పించాలని .డిల్లి నుంచి గల్లీ దాకా పి.ఎం నుంచి సి.ఎం వరకు ఎక్కడ ఎప్పుడు ఏం జరిగిన తన కెమెరాలో బంధించి ప్రపంచానికి చూపిస్తున్న అలాగే పత్రిక రంగం లోనూ టివి రంగం లోనూ చకచక లైవ్ టెలికాస్ట్ లు ఇస్తున్నారు. ఫోటోగ్రఫీ ఫిల్డ్ ఎప్పటికీ అప్డేట్ అవుతూనే వుంటున్న అలాంటి కెమెరా మెన్ లను గౌరవించడం అందరి బాధ్యత అని గుర్తుచేసుకున్నారు .జగ్గంపేట నియోజకవర్గంలో చరిత్రలో కనీవీనీయరుగాని మెజార్టీతో విజయం సాధించిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గండేపల్లి మండల ఫోటోగ్రఫీ యూనియన్ నాయకులు సభ్యులు పాల్గొన్నారు.