పండుగలా జరిగిన పింఛన్ల పంపిణీ – తణుకు ఎమ్యెల్యే ఆరిమిల్లి
పింఛన్ల పంపిణీ విజయవంతం చేయడానికి కృషిచేసిన ఎండిఓ లకు, సచివాలయం సిబ్బందికి,ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు,తెలుగుదేశం,బిజెపి,జనసేన నాయకులకు మరియు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి
ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడుగారి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణాన్ని తలపించేలా ఉందని తణుకు శాసన సభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు ఆకాంక్షించారు. తణుకు ఉమ్మడి పార్టి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ ఉదయం 6 గంటల నుంచే పెన్షన్ ఇళ్ల వద్దకే రావడంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. ఇంటి వద్దకే వెళ్లి పెరిగిన పెన్షన్ డబ్బును లబ్ధిదారులకు అందించడం జరిగిందని. వృద్ధులకు, వితంతువులకు 4000 తో పాటు ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించిన 3000 రూపాయలు మొత్తం కలిపి 7000 రూపాయలను అందించారు. దివ్యాంగులకు 6000 పెన్షన్ అందించడంతో వారిలో సంతోషం మరింత రెట్టింపు అయిందన్నారు. రాష్ట్ర ఖజానా ఖాళీ అయిపోయినా…ప్రజలకి ఇచ్చిన మాట తప్పకుండా నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. గతంలో పేరుకు ఒకటో తేది పెన్షన్ల పంపిణి అని చెప్పడమే కానీ నాలుగు అయిదు రోజుల పాటు సాగేదన్నారు. తణుకు నియోజక వర్గంలో దాదాపు 38 వేల పెన్షన్ లు అందించడం జరిగిందని కేవలంలో ఒక్క రోజులోనే 97% పంపిణీ చేయడం జరిగిందని అన్నారు. పెన్షన్ల పంపిణీని ఒక్క రోజులోనే పూర్తి చేసి లబ్ది దారులకు డబ్బులు అందేలా అధికార యంత్రాగాన్ని సన్నద్ధం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, ఇతర ప్రభుత్వ శాఖల అధికారులు అందరూ కలిసికట్టుగా పనిచేసి కేవలం ఒక్క రోజులోనే వేగంగా పింఛన్లను లబ్ధిదారుల ఇంటికి చేర్చారని తెలిపారు. అధికారులతో పాటు తెలుగుదేశం, జనసేన, బిజేపి పార్టీ ల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసారని తెలిపారు. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రాన్ని పునః నిర్మించే విధంగా ముందుకు వెలుతున్నారని ఆనందం వ్యక్తం చేసారు..