అంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొలువుతీరిన విషయం తెలిసిందే. తెలుగుదేశం, జనసేనతో పాటు బీజేపీకి చెందిన ఓ మంత్రి పదవుల్లో ఉన్నారు. గతంలో వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులు, వారి కుటుంబ సభ్యులు పలు వివాదాల్లో ఉన్న విషయం తెలిసిందే.
అప్పటి వైసీపీ మంత్రులపై టీడీపీ నాయకులు అనేక ఆరోపణలు చేశారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి చెందిన మంత్రి భార్య వివాదంలో చిక్కుకున్నారు.
పెద్దిరెడ్డి ఫ్యామిలీని జిల్లా నుంచి బహిష్కరించండి, దెయ్యాలు వేదాలు చెబితే?, టీడీపీ
మంత్రి భార్య ఏకంగా పోలీసుల మీద చిందులు వేసిన విషయం సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ అయ్యారు. ఇంకోసారి ఇలా జరిగే ఊరుకునేది లేదని, ఈ విషయంలో వివరణ ఇవ్వాలని సదురు మంత్రికి సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చెయ్యడం హాట్ టాపిక్ అయ్యింది. మంత్రి పదవి వచ్చి నెల రోజులు కూడా కాకుండానే భార్య దెబ్బకు ఆ మంత్రికి మైండ్ బ్లాక్ అయ్యింది.
ఆంధ్రప్రదేశ్ రవాణా శాఖా మంత్రిగా రామ్ ప్రసాద్ రెడ్డి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డి పోలీసులతో దురుసుగా ప్రవర్తించారని వెలుగు చూడటం కలకలం రేపింది. రాయచోటి పోలీసులు తనకు ఎస్కార్టుగా రావాలని మంత్రి భార్య హరితా రెడ్డి వారిని ఆదేశించింది. అయితే పోలీసులు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య హరితా రెడ్డికి ఎస్కార్ట్ గా వెళ్లడానికి నిరాకరించారు.
ఆ సమయంలో పోలీసులతో వాగ్వివాదానికి దిగిన హరితా రెడ్డి వారితో దురుసగా ప్రవర్తించారు. ఆ సమయంలో పోలీసులతో హరితా రెడ్డి దురుసుగా ప్రవర్తించారని, వారితో మాట్లాడిన తీరు సక్రమంగా లేదని సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. హరితా రెడ్డి పోలీసులతో గొడవపడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డికి ఫోన్ చేసి వివరణ కోరారు.
ఇంకోసారి ఇలా జరిగితే చూస్తూ ఊరుకోమని, మంత్రి పదవి వచ్చిందని ఇలా చెయ్యడం సరికాదని, ఇంకోసారి ఇలా జరిగితే చూస్తూ ఊరుకోనని సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి రామ్ ప్రసాద్ ను హెచ్చరించారు. ఈ విషయంపై వివరణ ఇవ్వాలని మంత్రి రామ్ ప్రసాద్ కు సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. తన భార్య హరితా రెడ్డి పోలీసు పట్ల వ్యవహరించిన తీరు బాధాకరంగా ఉందని, ఇంకోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని, ఈసారికి క్షమించాలని మంత్రి రామ్ ప్రసాద్ అన్నారు.