2024 అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు కీలక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. హామీల అమలు దిశగా ముందుకు సాగుతుంది.
ఈ క్రమంలో మెగా డీఎస్సీపై తొలి సంతకం చెసిన సీఎం.. నోటిఫికేషన్ విడుదలకు కసరత్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఎవరూ ఊహించని విధంగా ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల జరిగిన మంత్రి మండలి సమావేశంలో ప్రతిపాదనకు వచ్చిన టెట్ నిర్వాహణపై చర్చించని ప్రభుత్వం..
మెగా డీఎస్సీ కంటే ముందు టెట్ నిర్వహించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2024 టెట్ కు సంబంధించిన షెడ్యూల్, నోటిఫికేషన్, ఇన్ఫర్మేషన్ బులెటిన్, సిలబస్‌లకు సంబంధించిన పూర్తి వివరాలను జులై 2న వెల్లడిస్తామని ప్రభుత్వం తెలిపింది. అలాగే 2024 టెట్‌కు సంబంధించిన పూర్తి విరాలను https://cse.ap.gov.in/ వెబ్ సైట్ లో పొందుపరుస్తామని తెలిపారు.