March 14, 2025
Artelugunews.in | Telugu News App
తాడేపల్లిగూడెంపశ్చిమగోదావరి జిల్లా

జర్నలిస్టులకు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది 3F డైరెక్టర్ ఓపీ గొయంక

WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

జర్నలిస్టులకు ప్రోత్సాహం ఎప్పుడూ ఉంటుంది 3F డైరెక్టర్ ఓపీ గొయంక

స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా ఫారిన్ డెలిగేట్స్ చేతులు మీదుగా 160మంది జర్నలిస్టు పిల్లలకు ఉచితంగా నోట్ బుక్స్ అండ్ స్టేషనరీ వితరణ

పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం-

జర్నలిస్టులకు తమ సంస్థ నుంచి ప్రోత్సాహం ఎల్లప్పుడూ ఉంటుందని 3F ఇండస్ట్రీ డైరెక్టర్ ఓపీ గొయంక అన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరంలో జర్నలిస్టుల పిల్లలకు అవసరమైన నోట్ బుక్స్ స్టేషనరీని వారి స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా సుమారు 160మంది జర్నలిస్టు పిల్లలకు శుక్రవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గం పెంటపాడు మండలం ప్రతిపాడులోని ఫుడ్ ఫాట్స్ అండ్ ఫెర్టీలైజర్స్ ప్రాంగణంలో అందజేశారు. విద్యార్థుల చదువు విషయంలో ఎప్పుడూ తమ సంస్థ ముందుంటుందని దానికి తమ స్వాభిమాన్ ఫౌండేషన్ ద్వారా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ అందజేస్తామన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటుపడుతున్న తాడేపల్లిగూడెం జర్నలిస్టుల వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెస్ క్లబ్ నూతన పాలకవర్గాన్ని ఆయన ఈ సందర్భంగా అభినందించారు. ఈ సందర్భంగా ఓపీ గోయంకా మాట్లాడుతూ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో చేస్తున్న ఇటువంటి కార్యక్రమాలకు సహకరిస్తామన్నారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు తమ్మిశెట్టి రంగ సురేష్ ఇతర సభ్యులు చేస్తున్న సేవలను ఆయన అభినందించారు. ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రంగ సురేష్ మాట్లాడుతూ తమ కార్యవర్గం ఏర్పాటైన నాటి నుంచి జర్నలిస్టుల సంక్షేమం విషయంలో ముందుగా చెప్పిన ప్రకారం కార్యక్రమాలను దిగ్విజయంగా నిర్వహిస్తున్నామన్నారు. పేద, అనారోగ్య ఇబ్బందులు ఎదుర్కొంటున్న జర్నలిస్టులకు ఆర్థిక సత్కారం చేస్తున్నామన్నారు. జర్నలిస్టులు అందరికీ ప్రమాద భీమా ఇన్సూరెన్స్ వంటి కార్యక్రమాలను ఇప్పటికే పూర్తి చేసామన్నారు. ఇందులో భాగంగానే ప్రస్తుతం ఫుడ్ ఫ్యాట్స్ అండ్ ఫెర్టిలైజర్స్ స్వాభిమాన్ ఫౌండేషన్ వారి సహకారంతో సుమారు 160 మంది జర్నలిస్టుల పిల్లలకు విద్య సామాగ్రి పంపిణీ చేశామన్నారు. పది రోజులు ముందుగానే చెప్పినప్పటికీ వెంటనే స్పందించిన సంస్థ డైరెక్టర్ ఓపీ. గోయంకా, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రణవ్ గొయంక, హెచ్ఆర్ బ్లాక్ జనరల్ మేనేజర్ జనార్దన్, సత్యనారాయణలకు, అసిస్టెంట్ జనరల్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, సిబ్బంది శ్రీనివాస్ తదితరులకు ఈ సందర్భంగా ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసారు. రానున్న రోజుల్లో జర్నలిస్టుల కోసం ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం, పాత్రికేయులకు ఇంటి స్థలాలు అందులో ఇంటి నిర్మాణం వంటి ఏర్పాటుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. అనంతరం 3F సంస్థకు వచ్చిన ఫారిన్ డెలిగేట్స్, 3F యాజమాన్యం వారి సిబ్బంది చేతులు మీదుగా జర్నలిస్టు పిల్లలకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షుడు చింతకాయల దొరబాబు, కోశాధికారి శీలి రాజు, ఆర్గనైజింగ్ కార్యదర్శి సరికొండ రవికుమార్ రాజు, జిల్లా సంఘ నాయకులు ఎస్.లక్ష్మయ్య, బాసంశెట్టి బాల బాలాజీ, ప్రెస్ క్లబ్ సహాయ కార్యదర్శి కొత్తపల్లి గోపిచంద్, సభ్యులు పుండరీకాక్షుడు, ఆకుల రాంప్రసాద్, వెజ్జు నాగ వెంకట రమేష్, గంట శివ, గంట శ్రీనివాస్, ఆకుల రమేష్, కుందేటి నాగేశ్వరరావు, దేవ శివ, అయితం ప్రసాద్, గారపాటి ప్రసాద్, చిట్రోజు కృష్ణ, శీలి నరేష్, దేవ శివ, నాగేశ్వరరావు, సనపల భాను, వెంకట రత్నం, చందు, డెస్క్ జర్నలిస్టులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బైండోవర్ కేసులు ఉన్నవారిని ఏజెంట్లుగా నియమించరాదు – ఎన్నికల రిటర్నింగ్ అధికారిని స్వామి నాయుడు

AR TELUGU NEWS

ప్రత్తిపాడులో జన సైనికుల స్వచ్ఛభారత్

AR TELUGU NEWS

లైబ్రెరీలో నిరంతర అభ్యాసమే మనిషి జీవితంలో గొప్ప విజయం

AR TELUGU NEWS