నామినేటెడ్ పదవి కల్పించండి సీఎం తో పాటు మంత్రులను కలిసిన వారా రాజశేఖర్
కాకినాడ, : కూటమి విజయం సాధించి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గా బాధ్యతలు స్వీకరించి నేపథ్యంలో డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం నకు చెందిన దళిత వాయిస్ ఎడిటర్ దళిత సామాజిక వర్గానికి చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకులు వారా రాజశేఖర్ త్వరలో ప్రకటించబోవు నామినేటెడ్ పదవి లో తనకు అవకాశం కల్పించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ని మరియు రాష్ట్ర మంత్రులను వారి క్యాంపు కార్యాలయం లో కలిసి లేఖ ను అందజేశారు.ఈసందర్బంగా తాను 25 సంవత్సరాలనుండి తెలుగుదేశం పార్టీలో చురుకుగా వుంటూ పార్టీ కార్యకర్త గా అనేక కార్యక్రమాలు చేపట్టినని వ్యాపార వేత్త గా అనేక మందికి ఉపాధి కల్పించడం తో పాటు మీడియా రంగం లోకి ప్రవేశించి దళిత వాయిస్ అనే పత్రిక ను స్థాపించి వెనుక బడిన ఎస్సీ ఎస్టీ సామాజిక అభ్యున్నతి కోసం కృషి చేశానన్నారు. అలాగే పత్రిక ద్వారా టీడీపీ ప్రభుత్వం దళిత సంక్షేమం కోసం 2014-19 నారా చంద్రబాబు నాయుడు ప్రవేశ పెట్టిన అనేక పథకాలు ను పత్రిక ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లోకి తీసుకుని వెళ్లానని 2019-2024 లో జగన్ ప్రభుత్వం దళితుల వ్యతిరేకం వ్యవహారిస్తూ ఎస్సీ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యం చెయ్యడం దళితుల పై దాడులు వంటి సంఘటలు ప్రజా వ్యతిరేక విధానాలు పై పత్రిక ద్వారా ప్రజా చైతన్యం తీసుకుని వచ్చి 2024 లో టీడీపీ బీజేపీ జనసేన కూటమి విజయం లో తన వంతు పాత్ర పోషించిన నాకు నామినేటెడ్ పదవి కల్పిస్తే పార్టీ బలోపేతం తో పాటు ప్రజలకు మరింత సేవ చేసుకుంటానని లేఖ లో పేర్కొన్నారు.హోం మంత్రి తానేటి వనిత పురపాలక శాఖ మంత్రి నారాయణ మహిళ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యా రాణి రెవిన్యూ శాఖ మంత్రి అనగాన సత్యప్రసాద్ కలిసి లేఖను అందజేశారు.