రైల్వే ఉన్నత అధికారులకు సమస్యలపై వినతులు
* రద్దయిన రైళ్ల స్థానంలో ప్రత్యామ్నాయ రైళ్ళను వేయాలి
భీమవరం జూన్ 25 :
భీమవరం హౌసింగ్ బోర్డు కాలనీ డెవలప్ మెంట్ కమిటీ, సిపిఐ, సీపీఎం, లయన్స్ క్లబ్, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో భీమవరం జంక్షన్ రైల్వే స్టేషన్లో రద్దయిన రైళ్ల స్థానంలో ప్రత్యామ్నాయ రైళ్ళను వేయాలని కోరుతూ స్టేషన్ సుపరిండెంటెండ్ కు వినతిపత్రాన్ని అందించి రైల్వే డిఏంలకు ప్యాక్స్ ద్వారా వినతి పత్రాన్ని అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. హౌసింగ్ బోర్డు డెవలప్ మెంట్ కమిటీ అద్యక్షులు సరిపిడకల రామారావు, కార్యదర్శి ముదునూరి సూర్యనారాయణ రాజు మాట్లాడుతూ రైల్వే పనులపై దృష్టి సారించి భారత రైల్వే శాఖ త్వరితగతిన నిర్మాణాలకు పని చేయడం శుభ పరిణామమని, ఈ నేపథ్యంలో రద్దైన రైళ్ల కారణంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని, రైల్వే అధికారులుగా జిఏం, జిఆర్ఎం లతో పాటు ఉన్నత అధికారులు కూడా ప్రత్యామ్నాయ మార్గాలను చూడాలని కోరారు. సిపిఐ, సీపీఎం నాయకులు ఏం సీతారాం ప్రసాద్, వైఖంఠరావు, చెల్లబోయిన వెంకటేశ్వరరావు లు మాట్లాడుతూ అతి సామాన్య ప్రయాణికులకు ఈ ప్రత్యామ్నాయ మార్గాలతో ఎంతో ఉపయోగకరమని అన్నారు. దేవస్థాన మందిర అధ్యక్ష, కార్యదర్శులు కంతేటీ వెంకటరాజు, కుక్కల బాల, కడలి వెంకటేశ్వరరావు, జనపాటి మధు ఈ విషయంపై మాట్లాడారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ హైదారాబాద్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, విజయవాడ రీజనల్ మేనేజర్ నరేంద్ర ఆనంద రావు పాటిల్ కు ప్యాక్స్ ద్వారా వినతి పత్రాన్ని అందజేస్తున్నామని అన్నారు. ఈ సమస్యను పరిష్కరించి తగు న్యాయం చేయలని కోరారు. కార్యక్రమంలో స్టేషన్ సుపరిండెంటెండ్ చక్రవర్తి, లయన్స్ క్లబ్ పట్టణ ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, ఫణి తదితరులు పాల్గొన్నారు