విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తుల అమ్మకం ఆపాలి – సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కమిటి
భీమవరం:జూన్21:
సిపిఎం పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి బి.బలరాం డిమాండ్ చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మకానికి పెట్టి దానిని దెబ్బతీయాలని చూడటం దారుణమన్నారు. మూడోసారి అధికారాన్ని చేపట్టిన కేంద్ర ప్రభుత్వం విశాఖపట్నం,హైదరాబాద్,ముంబై, చెన్నై,పూనెలలో ఉన్న విశాఖ స్టీల్‌ప్లాంట్ ఆస్తుల్ని అమ్మేయాలని నిర్ణయం తీసుకున్నుట్లు గా వార్తలు వస్తున్నాయన్నారు. ఇది ఆంధ్రా ప్రజలను చాలా ఆందోళనలకు గురిచేస్తోందన్నారు. విశాఖ ఉక్కు పోరాటాల హక్కు32మంది ప్రాణత్యాగాల ఫలితం విశాఖ స్టీల్‌ప్లాంట్ అన్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ అమ్మోద్దని సంత్సరాల తరబడి అక్కడ ప్రజానీకం,కార్మికులు, ఉద్యోగులు, విద్యార్ధులు పోరాటాలు చేస్తున్నారు,రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళనలు జరుగుతున్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మైనింగ్ కేటాయించకపోయినా లాబాల బాటలో నడుస్తున్న ప్యాక్టరీ విశాఖ స్టీల్‌ప్లాంట్. కోవిడ్‌లో అనేకమందికి ఆక్సిజన్ ఇచ్చి ప్రాణాలు కాపాడిన ఫ్యాక్టరీని ఇప్పుడు దాని ఊపిరి తీయాలని చూస్తున్నారు. ఇది చాలా దుర్మార్గమని బలరాం అన్నారు.
ఇటీవలే ప్రమాణ స్వీకారం చేసిన ఉక్కు, గనుల శాఖామంత్రులు, సహాయ మంత్రులు నర్సాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీనివాసవర్మ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ని ప్రైవేట్‌పరం కానివ్వం, అమ్మకానికిపెట్టం,దానికి మైనింగ్ కేటాయిస్తాం అని ప్రకటనలు చేశారు.ఆమాట చెప్పి 4రోజులుగడవకముందే దాని ఆస్తులను అమ్మడం అంటే ఇంతకంటే దారణమైన విషయం మరొకటిలేదన్నారు.
రాష్ట్ర నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి తక్షణం విశాఖ ఉక్కు ఆస్తుల్ని అమ్మకాన్ని ఆపేలా చర్యలు తీసుకోవాలి,దానికి గనులు కేటాయించాలని బి.బలరాం సిపిఎం పార్టీ తరపున కోరారు.