*విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరును పునరుద్ధరణ చేయ్యడం హర్షనీయం*
రాజోలు, జూన్ 19 : విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరును ప్రభుత్వం పునరుద్ధరణ చేయ్యడంపై దళిత చైతన్య వేదిక నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా రాజోలు పట్టణంలోని అంబేడ్కర్ సామాజిక భవనంలో బుధవారం దళిత చైతన్య వేదిక అత్యవసర సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న రాజోలు వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు మాట్లాడుతూ విదేశీ విద్యా విధానానికి గత ప్రభుత్వం అంబేడ్కర్ పేరును తొలగించడం దురదృష్టకరమన్నారు. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం విదేశీ విద్యకు అంబేడ్కర్ పేరును పునరుద్ధరణ చేసి అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా మరలా పునరుద్ధరణ చేయ్యడం ఆనందంగా ఉందన్నారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన ఎస్సీ సంక్షేమ పథకాలను, ఎస్సీ కార్పొరేషన్ నిధులను, సబ్ ప్లాన్ నిధులను కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం ప్రభుత్వం పునరుద్ధరణ చేసి ఎస్సీల పురోగతికి కృషి చేయ్యాలని రాష్ట్ర ప్రభుత్వానికి దళిత చైతన్య వేదిక నాయకులు విజ్ఞప్తి చేసారు. ఈ రాష్ట్రంలో దళితుల పరిస్థితులు చాలా దుర్భరంగా ఉన్నాయనే విష్యాన్ని ప్రభుత్వం గుర్తెరికి గత ప్రభుత్వం దళితులకు నిర్వీర్యం చేసిన రాజ్యాంగ బద్ధమైన హక్కులను, రాయితీలను, అవకాశాలను, నిధులను పునరుద్ధరణ చేయ్యాలని దళిత నాయకులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకుడు బత్తుల మురళీకృష్ణ, సమన్వయ కర్త బత్తుల జనార్దనారావు, నాయకులు జిల్లెళ్ళ వినోద్, చుట్టుగుళ్ళ సత్యనారాయణ, తెన్నేటి నాగేశ్వరవు, మందపాటి మధు, గోగి మోహన్,పొన్నమాటి భాస్కర్, రిటైర్డ్ డిప్యూటీ కలక్టర్ బుడితి గోపాలకృష్ణ, దిగుమర్తి ప్రకాష్, కాకర విశ్వనాధం తదితరులు పాల్గొన్నారు.