ఢిల్లీ పయనమైన జిల్లా ఎన్డీయే కూటమి నాయకులు
నర్సాపురం జూన్ 18 :
నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ కేంద్ర మంత్రి గా మంగళవారం బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఎమ్మెల్యేలు, బిజెపి, జనసేన నాయకులు ఢిల్లీకి బయలుదేరారు. ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధా కృష్ణ, నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, పత్సమట్ల ధర్మరాజు నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు సీనియర్ బిజెపి నాయకులు దంతులూరి నరేంద్ర ,పాకా వెంకట సత్యనారాయణ మరియు బిజెపి నాయకులు గన్నవరం ఎయిర్పోర్ట్ నుండి బయలుదేరి ఢిల్లీ వెళ్లారు.