సమాచార హక్కు చట్టం జిల్లా అధ్యక్షులుగా వసంతాడ హరేష్
తణుకు :జూన్ 18
జై భారత్ సమాచార హక్కు చట్టం పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షులుగా వసంతాడ హరీష్ ను నియమించినట్లు రాష్ట్ర చైర్మన్ బి.హెచ్ సుమిత్రానందన్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా సుమిత్రానందన్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ సమాచార హక్కు చట్టాన్ని అందుబాటులో తీసుకురాడమే కాకుండా ప్రతి ఒక్కరికి లక్ష్యంగా ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లో అంకుత దీక్షతో పనిచేస్తున్నామని ఆయన అన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పడిన పశ్చిమగోదావరి జిల్లా ఏడు నియోజకవర్గాలకు అధ్యక్షులుగా వసంతాడ హరీష్ ను ఎంపిక చేయడం జరిగిందన్నారు.
ఈ సందర్భంగా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ముఖ్య సలహాదారులు వజ్ర భారతి పేపర్ ఎడిటర్ పమ్మి ఏడుకొండలు నూతనంగా ఎన్నికైన హరీష్ కు శుభాకాంక్షలు తెలిపారు. శుభాకాంక్షలు తెలిపిన వారిలో సమాచార హక్కు చట్టం రాష్ట్ర నాయకులు తమరపు సత్యనారాయణ, ఉన్నారు.
అనంతరం హరీష్ మాట్లాడుతూ: జిల్లాలోని భీమవరం, నరసాపురం పాలకొల్లు, తణుకు, తాడేపల్లిగూడెం , ఉండి, పరిధిలో ఉన్న ప్రజలందరికీ అందుబాటులో ఉంటూ సమాచార హక్కు చట్టంపై అవగాహన కల్పిస్తామని, ఏ అధికారి అయిన పౌరుడు అడిగిన సమాచారాన్ని తగిన సమయంలో ఇవ్వాలి, ఒకవేళ ఎవ్వని వారిపై వారిపై స్పందిస్తామని సత్వరమే సమస్యను పరిష్కరిస్తామని తెలిపారు. అధికారులు ప్రతి ఒక్కరూ సమాచారం హక్కు చట్టం 2005 ప్రకారం ప్రతి పౌరుడుకు 30 రోజులలోపు తమ అడిగిన సమాచారం అందించడం వారి కర్తవ్యం అని లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకునే లాగా మేము ముందుకు కొనసాగుతామని ఆయన తెలిపారు.