పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత ..
ఆర్టీసీ డిఎం మూర్తి
భీమవరం జూన్ 17:పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని, ఇందుకోసం విరివిగా మొక్కలు నాటి సంరక్షించాలని ఆర్టిసి డిపో మేనేజర్ జి సత్యనారాయణ మూర్తి అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక, ప్రభుత్వ పర్యావరణ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ప్లాస్టిక్ ను రద్దు చేయాలి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అవగాహనా సదస్సు, ర్యాలీ ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించారు. డిపో మేనేజర్ సత్యనారాయణ మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడుకుంటేనే మానవాళి మనుగడ సాధ్యమని, పచ్చదనంతో పాటు పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. ప్రతి ఇంటి ఆవరణలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టాలని కోరారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని, మానవ మనుగడ సాగాలంటే పర్యావరణం దెబ్బతినకుండా చూసుకోవాలని, ప్లాస్టిక్ ను రద్దు చేస ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. అనంతరం ఆర్టీసీ ప్రయాణకులు, ఆర్టీసీ సిబ్బందితో ప్రతిజ్ఞ నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ పట్టణ కార్యదర్శి గోపిశెట్టి మురళీ కృష్ణారావు, ఉపాధ్యక్షులు నరహరిశెట్టి కృష్ణ, ఆర్టీసీ అసిస్టెంట్ మేనేజర్ వై సురేష్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.