ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కూటమి ఎమ్మెల్యేలు బొలిశెట్టి శ్రీనివాస్ తదితరులు పోలవరం ప్రాజెక్టు సందర్శన
తాడేపల్లిగూడెం,
జూన్ 17.
ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నం సఫలంకానుందని తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. సోమవారం పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి ఆయన స్వాగతం పలికారు. గత ప్రభుత్వంలో నిర్వీర్యమైన ప్రాజెక్టులోని అన్ని అంశాలను గుర్తించి ప్రాజెక్టు ప్రారంభిస్తామని ఆయన అన్నారు. గతంలో ప్రతి సోమవారం పోలవరం అంటూ చంద్రబాబు నాయుడు చేసిన పర్యటన సందర్భంగా మరోసారి గెలిచిన సందర్భంగా మళ్లీ అదే సిద్ధాంతాన్ని పాటించడం ఆయన నిబద్ధతకు నిదర్శనమని బొలిశెట్టి శ్రీనివాస్ కొనియాడారు. పర్యటన మొత్తం ముఖ్యమంత్రి చంద్రబాబు వెంట బొలిశెట్టి శ్రీనివాస్, ఇతర కూటమి ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ కార్యక్రమంలో తాడేపల్లిగూడెం కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.

previous post