బక్రీద్ పండుగలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు ఘన స్వాగతం
నర్సాపురం జూన్ 17 : ముస్లిం సోదరులు ఎంతో ఘనంగా జరుపుకునే బక్రీద్ పండుగా ప్రార్థనలు సోమవారం పట్టణంలో మిషన్ హై స్కూల్ రోడ్డులోని ఈద్గాలో నిర్వహించారు.
ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కు ముస్లిం సోదరులు స్వాగతం పలికారు. ఈద్గా లో ఏర్పాటు చేసిన నమాజు లో నాయకర్ పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం ధార్మికో ఉపన్యాసం చేశారు. దైవ ప్రవక్త ఇబ్రహీం మహోన్నత త్యాగాన్ని స్మరించుకుంటూ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారన్నారు. త్యాగ నిరతికి బక్రీద్ పండుగ నిదర్శనమని అన్నారు. ధనిక, పేద అన్న తారతమ్యం లేకుండా రాగద్వేషాలకు అతీతంగా మైనారిటీలందరూ భక్తిశ్రద్ధలతో ఈ పండుగను జరుపుకుంటున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరూ దాన గుణం, సేవాగుణం అలవర్చుకోవాలని చెప్పారు. పండుగ సందర్భంగా ముస్లిం సోదరులు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకుంటూ, బంధుమిత్రులతో సంతోషంగా గడిపారు..ఈ కార్యక్రమం లో నియోజకవర్గ జనసేన టిడిపి బిజెపి నాయకులు కార్యకర్తలు, విరమహిళలు పాల్గొన్నారు.