*విద్యార్ధులకు స్టూడెంట్ కిట్ లు పంపిణి చేసిన తణుకు ఎమ్యెల్యే ఆరిమిల్లి*
వేసవి సెలవలు అనంతరం తిరిగి ప్రారంభమయినందున ఈరోజు తణుకు పట్టణంలో జిల్లా పరిషత్ బాలురు ఉన్నత పాఠశాల (బాయ్స్ హై స్కూల్ ) నందు మరియు జాస్తి సీతామహాలక్ష్మి బాలికోన్నత పాఠశాల (గర్ల్స్ హై స్కూల్ ) నందు రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తున్న 3 జతల యూనిఫాం క్లాత్, ఒక స్కూల్ బ్యాగ్, ఒక బెల్టు, ఒక జత బూట్లు, 2 జతల సాక్స్లు, పాఠశాల విద్యా సంవత్సరం పుస్తకాలు మరియు వర్క్ బుక్స్ అదనంగా, 1వ మరియు 6వ తరగతి విద్యార్థులు ఇంగ్లీష్ నుండి ఇంగ్లీషు మరియు తెలుగు డిక్షనరీ ఉన్నటువంటి స్టూడెంట్ కిట్ లను తణుకు శాసన సభ్యులు శ్రీ ఆరిమిల్లి రాధాకృష్ణ గారు విద్యార్థినులకు పంపిణీ చేసారు. ఈ సందర్బంగా విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం బాలిక ఉన్నత పాఠశాల ఆడిటోరియం పనులను పరిశీలించడమైనది.
ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.