రక్త దానం చేసిన
ఓఎన్‌జిసి యూనిట్ సిఐఎస్‌ఎఫ్ జవాన్లు
నర్సాపురం జూన్ 14 :వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా 18 మంది ఓఎన్‌జిసి యూనిట్ సిఐఎస్‌ఎఫ్ జవాన్లు రక్తదానం చేసారు. నర్సాపురం ప్రబుత్వ ఆసుపత్రి బ్లడ్ స్టోరేజ్ యూనిట్ మరియు రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ సంయుక్త ఆధ్వర్యములో వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా శుక్రవారం వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా నర్సాపురం ఆసుపత్రిలో వరల్డ్ బ్లడ్ డోనర్ డే అవగాహన కార్యక్రమం జరిగినది.ముందుగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డా.సుప్రియా మాట్లాడుతూ దేశమునందు రక్తము ఆవశ్యకత ఎక్కువగా ఉన్నందున మగ మరియు ఆడ ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్న ఎవరైనా రక్తదానం చేయవచ్చు. పురుషులు ప్రతి మూడు నెలలకు ఒకసారి సురక్షితంగా దానం చేయవచ్చు, మహిళలు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి విరాళం ఇవ్వవచ్చు అని తెలియజేశారు. ఐసిటిసి హెల్త్ కౌన్సెలర్ జి.జేసు ప్రసాద్ బాబు మాట్లాడుతూ మన ప్రభుత్వ ఆసుపత్రి లో బ్లడ్ స్టోరేజ్ యూనిట్ మరియు ఇండియన్ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఉన్నది , 18 మరియు 60 సంవత్సరాల మధ్య వయస్సు వారు రక్తదానం చేయడం మంచిది , హిమోగ్లోబిన్ – 12.5 గ్రా/డిఎల్ కంటే తక్కువ ఉండకూడదు , హిమోగ్లోబిన్ 12.5 గ్రా/డిఎల్ తక్కువ ఉంటే రక్త దానం చేయకూడదు అని తెలియజేశారు.వరల్డ్ బ్లడ్ డోనర్ డే సందర్భంగా రక్తదానం సందర్భంగా ప్రతిజ్ఞ్య చేయడం జరిగింది.సూపరింటెండెంట్ డా.సుప్రియా, ఐసిటిసి హెల్త్ కౌన్సెలర్ జి.జేసు ప్రసాద్ బాబు, బ్లడ్ స్టోరేజ్ యూనిట్ జనరల్ ఎల్‌టి కె.రవి, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎల్టీ మహేష్ఎం, ఆసుపత్రి డిఈఓ సుధా రాణి మరియు వైద్యులు , ఆసుపత్రి సిబ్బంది పాల్గొనడం జరిగింది