రక్తం. రెండక్షరాల పదమే కాని ఏ జీవైనా బతకాలంటే అత్యవరం
రక్తదానం చేసిన 9 మందికి సత్కారం చేసిన ఎమ్మెల్యే అంజిబాబు
భీమవరం జూన్ 14 :రక్తం’.. రెండక్షరాల పదమే కాని ఏ జీవి అయినా బతకాలంటే ఇది అత్యవసరమని, రక్తం అనేది పరిశ్రమల్లో ఉత్పత్తి అయి అంగట్లో దొరికేది కాదని, కేవలం మనిషిలో మాత్రమే ఉత్పత్తి అవుతుందని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ( అంజిబాబు) అన్నారు. శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఎమ్మెల్యే అంజిబాబు కార్యాలయంలో ప్రపంచ రక్త దాతల దినోత్సవాన్ని నిర్వహించి అదికసార్లు రక్తదానం చేసిన వారిని సత్కరించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ 18 నుంచి 65 ఏళ్ల వయసున్న ఆరోగ్యవంతులందరూ రక్తదానం చేయవచ్చని, మూడు నెలలకోసారి రక్తం ఇవ్వడం మంచిదని డాక్టర్లు చెబుతున్నారని. ఒక వ్యక్తి జీవిత కాలంలో 168 సార్లు రక్తదానం చేయవచ్చని, రక్తదానం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుందని అన్నారు. రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు. నిర్వాహకులు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ రక్తదానం ప్రాణదానం తో సమానమని, సిఎస్ఎన్ కళాశాల కార్యదర్శి చిడే సత్యనారాయణ ఇప్పటికీ వరకు 80 సార్లు రక్తదానం చేశారని అన్నారు. అనంతరం అధిక సార్లు రక్తదానం చేసిన 9 మందికి ప్రశంసా పత్రాలను అందించి సత్కరించారు. కార్యక్రమంలో చిడే సత్యనారయణ, కోళ్ల నాగేశ్వరరావు, నరహరిశెట్టి కృష్ణ, సకుమల్ల సత్యనారయణ తదితరులు పాల్గొన్నారు.