అగ్ని ప్రమాదం పొట్టన పెట్టుకుంది. తమకు మంచి భవిష్యత్తు ఇద్దామని పరాయి దేశానికి ఉపాధికి వెళ్లినవారు.. ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారన్న నిజాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపో తున్నారు. మరో 10 రోజుల్లో మాతృదేశం వచ్చి తమ కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుదా మనుకున్న ఆ కార్మికులు ప్రమాదంలో సజీవ దహనమయ్యారు. ఇంటికి రావటానికి అన్నీ సిద్ధం చేసుకున్న తరుణంలో అగ్ని ప్రమాదం వారిని కబశించింది. ఈ దుర్వార్త విన్న భార్యా పిల్లలు, కుటుంబంసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ నెల 12వ తేదీన కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్లోని మాంగాఫ్ ప్రాంతంలోని బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్ని ప్రమాదంలో పెరవలి మండలంలోని ఖండవల్లి, అన్నవరప్పాడు గ్రామాలకు చెందిన ఇద్దరు మృతి చెందారు. అన్నవరప్పాడు గ్రామానికి చెందిన మీసాల ఈశ్వరరావు (46), ఖండవల్లి గ్రామానికి చెందిన మొల్లేటి సత్యనారాయణ (44) కువైట్లో జరిగిన అగ్ని ప్రమా దంలో ఆహుతి అయినట్టు అక్కడ ఉన్న తెలుగు వారు తెలియజేశారని కుటుంబ సభ్యులు గురు వారం రాత్రి తెలిపారు. మీసాల ఈశ్వరరావుకి భార్య చిట్టి, కుమారుడు మీసాల సాయి, కుమార్తె కోమలి ఉన్నారు. మొల్లేటి సత్యనారాయణకు భార్య అనంతలక్ష్మి, కుమారుడు వెంకట సాయి ఉన్నారు. ఈ రెండు కుటుంబాల వారు వ్యవసాయ కూలీలు కాగా పొట్టకూటి కోసం వీరిద్దరూ కువైట్ వెళ్లారు. వీరు 10 ఏళ్లుగా అక్కడి మాల్లో సేల్మ న్లుగా పనిచేస్తున్నారు. మొల్లేటి సత్యనారాయ ణకు భార్యా పిల్లలతో పాటు తల్లిదండ్రులు ముక్తే శ్వరరావు, రాఘవులు కొడుకుపైనే ఆధారపడి జీవి స్తున్నారు. కొడుకు మృతి చెందాడన్న చేదు నిజం తెలిస్తే ఈ వృద్ధ తల్లితండ్రుల పరిస్థితి ఎలా ఉం టుందోనని ఆ కుటుంబ సభ్యులు ఈ విషయం చెప్పడానికి ఆందోళన చెందుతున్నారు. గ్రామస్తులు, బంధువులు ఆ రెండు గ్రామాలకు వచ్చి ఆ కుటుంబ సభ్యులను ఓదారుస్తున్నారు.

previous post