బక్రీద్ సందర్భంగా గోవధ జరగకుండా చూడాలని హై కోర్టు ఆదేశాలు ఇచ్చింది. గోవులను అక్రమంగా చంపితే చర్యలు తీసుకోవాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.గోవులను తరలించకుండా పోలీసులు చర్యలు తీసుకోవాలని తెలిపింది. ఇప్పటికే జంతూ వధ చట్టం అమలు చేస్తున్నామని ప్రభుత్వం వాదనలు వినిపించింది. ఈ క్రమంలో.. మూడు కమిషనరేట్ల పరిధిలో 150 చెక్ పోస్ట్ లు పెట్టామని పోలీసులు తెలిపారు. ఇప్పటికే గోవుల తరలింపు పై 60 కేసులు నమోదు చేశామన్నారు. ఇంతకుముందు చాలాసార్లు గోవధపై హైకోర్టులో విచారణ జరిగింది. ఈ క్రమంలో.. గోవధ నిషేధ చట్టం అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. అయినప్పటికీ బక్రీద్ రోజున గోవధ జరుగుతూనే ఉంది. కోర్టు ఆదేశాలు, ప్రభుత్వ ఆదేశాలను పక్కదారి పట్టిస్తున్నారు. మరీ.. ఈసారి అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతారో చూడాలి.
ముస్లింల ప్రధాన పండగలలో ఒకటి రంజాన్, రెండోది బక్రీద్.. బక్రీద్ ఈనెల 17వ తేదీ (సోమవారం) జరుపుకోనున్నారు. బక్రీద్ పండుగ సందర్భంగా మటన్ బిర్యానీ, మటన్ కుర్మా, మటన్ కీమా, షీర్ కుర్మా, కీర్ లాంటి వంటకాలను తయారు చేస్తారు. అందుకోసమని ఆ రోజున గోవధ భారీగా జరుగుతుంది. బక్రీద్ రోజు ముస్లింలు మృతి చెందిన వారి సమాధులను దర్శిస్తారు. సమాధులను అందంగా అలంకరిస్తారు. వారికిష్టమైన దుస్తులు, భోజనం అక్కడ ఉంచుతారు. స్వర్గంలో ఉన్న వారు వాటిని స్వీకరిస్తారని నమ్మకం. అన్ని గుణాల్లోనూ దానగుణమే ఉత్తమోత్తమమైనది. ఆకలి అనేది అందరి సమానమైనది కాబట్టి ఈ పండగకు నిరుపేద కుటుంబాలకు శక్త్యనుసారంగా దానధర్మాలు చేస్తూ కొంత కొంత మందికైన ఆకలి తీర్చగాలిగాం అని సంతృప్తి చెందుతారు.